సమంత లో ఆ లోపం లేదు.

0
597
rumors in samantha new film
rumors in samantha new film
    సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ సమంత నటీ నటులుగా ఒక చిత్రం తెరకెక్కుతుంది . ఈ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమై 10 రోజులు అయింది. ఇప్పటికే ఓ పాట షూటింగ్ కూడా పూర్తి చేసేశారు. సమంత షూటింగ్ లో పాల్గొన్న ఒకట్రెండు రోజులకే ఈ సినిమాపై కొత్త రూమర్ సృష్టించేసారు.
    ఈ సినిమాలో చరణ్ చెవిటి లోపం ఉన్న వ్యక్తిగా కనిపిస్తుంటే, సమంత ఓ మూగ అమ్మాయి గా నటిస్తోందని రూమర్ వచ్చింది. కొందరైతే గుడ్డిరాలిగా నటిస్తోందని అనేశారు.
    ఇలా వస్తున్న రూమర్స్ కి సమంతా టీం చెక్ పెట్టేసారు. సమంతా ఒక రిచ్ విలేజ్ గాళ్ గా నటిస్తుందని అఫిషియల్ గా ప్రకటించారు.
    గ్రామీణ నేపథ్యంతో సాగే పక్కా కమర్షియల్ సినమా అని చెప్పెసారు.
    రాం చరణ్ సినిమాలో సమంత పాత్ర చాలా ఆకట్టుకునేలా ఉంటుందని.. ఇంతగా పెర్ఫామెన్స్ కు స్కోప్ ఉండే రోల్ చేసే అవకాశం కెరీర్ లో ఒక్కసారి మాత్రమే వస్తుందని.. అంతటి ఇంపార్టెంట్ రోల్ చేస్తుందని, అలాగే నాగ్ నటిస్తున్న రాజుగారి గది2.. సావిత్రి బయోపిక్ మహానటి చిత్రాలలో కూడా సమంత కీలక పాత్రలు పోషిస్తోందని సమంత టీం అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here