ఒక్కో పాఠశాలకు రూ.50 వేలు…

0
322
Rs 50 thousand per high school
Rs 50 thousand per high school

ప్రభుత్వ స్కూళ్లలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5వేల 639 ఉన్నత పాఠశాలలకు సర్కారు స్కూళ్ల నిర్వహణ ఇతర అవసరాలకోసం ఒక్కో పాఠశాలకు రూ.50 వేల చొప్పున నిధులు ఇచ్చేందుకు మానవ వనరుల అభివృద్ధి శాఖ అనుమతిచ్చింది. ఈ నిధుల్లో 20 వేల రూపాయలను స్కూల్ మరమ్మతులు, ల్యాబ్ పరికరాల కొనుగోలు, కంప్యూటర్ ల్యాబ్ వినియోగించనున్నారు. రూ.5 వేలను బుక్స్, పీరియాడికల్స్, న్యూస్ పేపర్లు, స్పోర్ట్స్ పరికరాల కొనుగోలుకు ఖర్చు చేయనున్నారు. 25 వేల రూపాయలను తాగు నీరు, కరెంట్ చార్జీలు, ఇంటర్నెట్ డిజిటల్ తరగుతుల నిర్వహణకు వినియోగించాలని సూచిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 5వందల వరకే డబ్బును నేరుగా ఖర్చు చేయాలని అంతకు మించి వినియోగించాల్సి వస్తే చెక్ రూపంలో,ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ ద్వారా వినియోగించాలని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here