తెలంగాణ టాప్ NRI లుగా రాయ్ దాస్ మంతెన,మహేష్ తన్నీరు

0
455

 

గత 10 రోజులుగా నిర్వహించిన తెలంగాణ బెస్ట్ NRI సర్వే కు చాలా అద్భుతమైన స్పందన రావటం జరిగింది. ఇప్పటివరకు 14057 మంది నెటిజన్లు ఈ సర్వేలో పాల్గొనటం జరిగింది . ఈ నెల 20 న ముగియాల్సిన సర్వే అర్దాంతరంగా కొన్ని సాంకేతిక కారణాల వలన ఈ నెల 17 న ఆపేయడం జరిగింది. దీనిని మళ్ళి ఓపెన్ చేద్దామనుకున్నా కూడా థర్డ్ పార్టీ నుంచి పూర్తి సహకారాలు లేక 17 వరకు ముగిసిన సర్వేను పరిగణలోకి తీసుకోవాలని న్యాయ నిర్ణేతలు నిర్ణయం తీసుకోవటం జరిగింది.

అయితే విజేతలను కేవలం ఎక్కువ ఓట్ల ఆధారంగానే  కాకుండా సోషల్ మీడియాలో ట్రేండింగ్ కామెంట్స్ ,షేర్ల ను కూడా పరిగణలోకి తీసుకోవాలని న్యాయ నిర్ణేతలు నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆలా రెండు రకాల విజేతలను ప్రకటించటం జరుగుతుంది. మొదటి రకంలో ఎక్కువ ఓట్లు వచ్చి సోషల్ మీడియాలో ట్రేండింగ్ ఉన్న టాప్ 3 విజేతలను టాప్ 1,టాప్ 2,టాప్ 3 విజేతలుగా ప్రకటిస్తున్నాం. రెండవ రకంలో విజేతలను వచ్చిన ఓట్లు ,సోషల్ ట్రేండింగ్ మరియు మేము బయట చేసిన ర్యాండమ్ సర్వే ద్వారా మోస్ట్ పాపులర్ ,పాపులర్ 2,పాపులర్  3 పాపులర్ విజేతలుగా ప్రకటిస్తున్నాం . వారిలో విజేతలు వీరే .

వోటింగ్ మరియు ట్రేండింగ్ ఆధారంగా టాప్ 3 విజేతలు

1) రాయ్ దాస్ మంతెన(అమెరికా) – వచ్చిన ఓట్లు 3333 (24%)                                                                            (ఒక సామాన్య కుటుంబంలో పుట్టి, గత 20 ఏళ్లుగా అమెరికాలో ఉంటూ తెలంగాణ ఉద్యమంలో ఎంతో మందికి స్పూర్తి ఇచ్చిన వ్యక్తి.బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే ఒక సామాజిక మేధావి)

2) నాగేందర్ రెడ్డి కాసర్ల (ఆస్ట్రేలియా )–  వచ్చిన ఓట్లు 2651(19%) .                                                      (ఆస్ట్రేలియా లో ఉంటూ తెలంగాణా ఉద్యమంలో పాల్గొని,రాష్ట్రం ఏర్పడ్డాక చిన్న నగరాల్లో IT పరిశ్రమ వ్యాప్తి కి రాష్ట్రం చేస్తున్న ప్రయత్నంలో కరీంనగర్ లో కంపనీ పెట్టి అక్కడ IT పరిశ్రమను విస్తరింపచేస్తున్న NRI)

3)  శ్యాం ఆకుల (డెన్మార్క్ ) – వచ్చిన ఓట్లు 2407 (17%)          (డెన్మార్క్ లాంటి దేశంలో తెలంగాణవాదులను ఏకం చేస్తూ,అక్కడి విద్యార్థులకు, ఉద్యోగులకు బాసటగా ఉంటున్న యువకుడు)

ట్రేండింగ్ మరియు రాండమ్ సర్వే ఆధారంగా టాప్ 3 విజేతలు

1) తన్నీరు మహేష్ (అమెరికా) -మోస్ట్ పాపులర్ .        (తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అమెరికాలో ఉన్న తెలంగాణ వాదులను ఏకం చేయటానికి కృషి చేసి,రాష్ట్రం ఏర్పడ్డాక సామాజిక సేవలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు)

2) పోలీస్ రమేష్ (ఖతార్ ) -పాపులర్ 2      (గత 20 ఏళ్లుగా ఖాతార్ లో కొన్ని వేల మంది ఉన్న తెలంగాణ   యువకులకు ఉపాధి కల్పించాడు,ఎంతో మంది యువ వ్యాపార వేత్తలకు బాసట గా నిలిచాడు.నిజామాబాద్ లో కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారు.)

3) కృష్ణ దోనికేని (దుబాయ్) -పాపులర్ 3                 (తెలంగాణ Nri పాలసి కోసం దీక్ష చేసి,పాలసీ అవసరాన్ని అటు గల్ఫ్ భాదితులకు అవగాహన తెప్పించటంలో,ప్రభుత్వం పైన ఒత్తిడి తేవటంలో కీలక పాత్ర వహించాడు.)

ఈ సర్వేకు సహకరించిన నెటిజన్లకు కృతఙ్ఞతలు తెలియచేస్తూ ,రాబోయే కాలంలో ఎలాంటి తప్పిదాలు లేకుండా సర్వేలు చేసి ప్రజల నాడిని సమాజానికి అందచేస్తామని తెలియచేస్తున్నాం.

రాయ్ దాస్ మంతెన(అమెరికా)

మహేష్ తన్నీరు(అమెరికా)                                                                                                                             నాగేందర్ రెడ్డి కాసర్ల (ఆస్ట్రేలియా )-           

శ్యాం ఆకుల (డెన్మార్క్ )

 

పోలీస్ రమేష్ (ఖతార్ ) 

కృష్ణ దోనికేని (దుబాయ్) 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here