రోబో పోలీస్- తెలంగాణ ఇంజనీర్ల అద్భుత సృష్టి

0
500
Police robo in hyderabad
Police robo in hyderabad
    నలుగురు యువ ఇంజనీర్లు అద్భుతం చేసారు. పోలీస్ వ్యవస్థలో దేశంలోనే తొలి సారి మన తెలంగాణలో ఒక రోబోను ప్రవేశ పెట్టనున్నారు. రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేశ్‌ రంజన్‌ ప్రపంచంలోనే అరుదైన పోలీస్ రోబో డిజైన్ ను ఆవిష్కరించారు. హైదరబాద్ మహా నగరంలో నిర్మించిన టీ-హబ్ ఈ యువ ఇంజనీర్లకు అద్భుతమైన అవకాశానిచ్చింది. రెండెళ్ళ క్రితం ఈ టీ-హబ్ లో హెచ్‌బోట్స్‌ రోబోటిక్స్‌ స్టార్టప్‌ ను ప్రారంభించిన కిషన్, హర్ష, అభిషేక్ , అన్వేష్ లు ఈ రోబో తయారీకి పరిశోధనలు చేస్తూ విజయం దిశగా సాగిపోతున్నారు.
    ఈ పోలీస్ రోబో జూబ్లీ చెక్ పోస్ట్ పరిసర ప్రాంతంలో విధి నిర్వహణ చేయనున్నట్లు తెలిపారు. ఆ పరిసర ప్రాంతంలో ఫోటోలు, వీడీయోలు , మెస్సెజ్ లు అలాగే ప్రజలు ఇచ్చే కంప్లెంట్స్ ను పోలీస్ మెయిన్ సర్వర్ కి చేరవేస్తుంది. అలాగే బాంబులు, ఇతర అనుమానస్పద వస్తువులు ఉన్న వాటి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఇంత అద్భుతమైన ఈ రోబో డిసెంబర్ 31 వ తేదీ నుండి విధి నిర్వహణలో పాలు పంచుకోనున్నది.

తెలంగాణ ప్రభుత్వం, పోలీసుల అనుమతితో ఈ రోబోకి యూనీఫాం ని వేసి విధి నిర్వహణలో భాగస్వామిని చేయనున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here