పంట ఆరేద్దామంటే ప్రాణాలు పోతున్నాయి

0
1535
road accident at bheemgal to armoor road
road accident at bheemgal to armoor road

    ప్రజల సంక్షేమాన్ని కోరుకునే వారిలో రైతన్న కంటే ముందు ఎవరు రారు. అలాంటి రైతన్న తప్పిదం వల్లో తెలిసీ తెలియని వియషం వల్లో కాని ఒక నిండు ప్రాణం గాలిలో కలిసి పోయింది రైతన్న ఆరుకాలం శ్రమించి పండించిన వరి పంటని ఎండ పెట్టటానికి చేసిన కుప్పల మూలంగా ఒక నిండు ప్రాణం పోయింది. రైతులకి పంటని ఆరపెట్టడానికి స్థలం లేక రోడ్లపై ఎండపెట్టడం, దానిని కాపాడటానికి కుప్పల చుట్టూ రాళ్ళని పెట్టి వదిలేస్తుంటారు. అవే కొంత మంది అమాయక ప్రాణాలని బలిగొంటున్నాయి. ఇటీవల భీంగల్ నుండి ఆర్మూర్ వెళ్ళే ప్రధాన రహదారిలో సురేష్ అనే యువకుడు పంట కుప్పలకి అడ్దుగా పెట్టిన రాళ్ళు తగిలి మృత్యువాత పడ్డాడు.

    వాస్తవంగా ఇంతకు ముందు రోడ్ల మీద ఇలా పోసేవారు కాదు. గత 5 – 6 సంవత్సరాల నుండి పండించిన పంటలని నోటికి అందించుకోడానికి వాటిని ఎండపెట్టే స్థలం లేక రోడ్ల మీద పోస్తున్నారు రైతులు. ప్రభుత్వం రైతుల పంటలని ఆరబెట్టెందుకు తగిన ప్లాట్ ఫాం లను నిర్మించి రోడ్లపై పంటలను ఎండబెట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలి. దీని వల్ల రైతులకి సహాయపడటమే కాకుండా అమాయక ప్రాణాలని రక్షించిన వారవుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here