సెకండ్ హాఫ్ రైట్ …ఫస్ట్ హాఫ్ రాంగ్ రాంగ్

0
457

రవి (సుమంత్ అశ్విన్‌) పోలీస్ అవ్వలనుకుంటాడు కాని తండ్రి అక‌స్మాత్తుగా చ‌నిపోవ‌డంతో కండ‌క్ట‌ర్‌గా జాయిన్ అవుతాడు. కొత్త‌గా జాబ్‌లోకి వ‌చ్చిన ర‌వికి గ‌విటి అనే ఊరు రూట్ వేస్తారు. ఆ రూటు చాల సంక్లిష్టంగా ఉండటంతో బ‌స్సు వెళ్లే టైమే కాని ఎప్పుడు తిరిగి వ‌స్తుందో ఎవ్వ‌రికి తెలియ‌దు. ఆ రూటు బ‌స్ డ్రైవ‌ర్ శేషు( కాలకేయ ప్రభాకర్). ఆ ఊరికి వెళ్లేది ఒక్క బస్సే కావటంతో బస్ డ్రైవర్, కండక్టర్ లు ఊరి జనాలకు దగ్గరవుతారు. ర‌వి ఆ బ‌స్సులో డైలీ వ‌చ్చే హీరోయిన్ క‌ళ్యాణి (పూజ జవేరి)తో రవి ప్రేమలో పడతాడు. త‌ర్వాత అనుకోకుండా ఊరి స‌ర్పంచ్ విశ్వనాథ్ కుమారుడు దేవా చ‌నిపోతే ఆ నేరం ర‌వి మీద ప‌డుతుంది. అసలు దేవా ఎలా చనిపోయాడు..? ఆ కేసు నుంచి రవి ఎలా బయటపడ్డాడు..? అన్నదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

 • సినిమాలో వచ్చే ప్రధాన పాత్రలన్నింటికీ కథతో ఏదో ఒక విధంగా ఓ కనెక్షన్ ఉండడం
 • ఇక సుమంత్-ప్రభాకర్‌ల మధ్యన వచ్చే సన్నివేశాలు సరదాగా బాగున్నాయి.
 • ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకు ఓ హైలైట్‌
 • సుమంత్ అశ్విన్ పాత్ర చాల బాగుంది ,ప్రదానంగా అయన పలికించిన ఎమోషన్స్
 • సినిమా అసలు కథలోకి వెళ్ళే నేపథ్యం నుంచి వచ్చే ఈ ట్విస్ట్, మేకింగ్ పరంగానూ బాగుంది.
 • ఇక డ్రైవ‌ర్ క్యారెక్‌‌ర్‌లో కాల‌కేయ ప్ర‌భాక‌ర్‌కు కూడా మంచి పాత్రే ద‌క్కింది.
 • డ్రైవ‌ర్‌ పాత్రలో ప్రభాకర్ బాగా సెట్ అయ్యాడు.

మైనస్ పాయింట్స్ :

 • ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి లింక్ లేదు
 • హీరోహిన్ పాత్ర
 • ఫస్ట్ హాఫ్
 • శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రఫి బాగుంది.

సాంకేతిక విభాగం :

 • శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీలో ప‌ల్లెటూరి అందాలు బాగున్నాయి.
 • జేబీ మ్యూజిక్ యావ‌రేజ్ మార్కులేయించుకుంది. నిర్మాణ విలువ‌లు ఓకే.
 • ఇక డైరెక్ట‌ర్ ఎంచుకున్న క‌థ ఓకే అనిపించినా ట్రీట్‌మెంట్ ప‌రంగా ఫెయిల్ మార్కులేయించుకున్నాడు.
 • ఇక ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మను పూర్తి స్థాయిలో ప్రతిభ చూపడంలో విఫలమయ్యాడనే చెప్పుకోవాలి. మళయాలంలో ఆకట్టుకున్న కథను, ఇక్కడి నేపథ్యానికి తగ్గట్టుగా బాగానే మార్చుకున్నా, ఆ కథను పాతతరం పరిస్థితులు, ఆలోచనల చుట్టూ చెప్పడమే మను చేసిన తప్పుగా కనిపిస్తుంది. దర్శకుడిగా మాత్రం కొన్నిచోట్ల మను మంచి ప్రతిభే చూపాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, ప్రీ క్లైమాక్స్‌లో ట్విస్ట్ బయటపడే విధానం.. ఇలాంటి సన్నివేశాల్లో మను మేకింగ్ పరంగా ఫర్వాలేదనిపించాడు.

Verdict:సెకండ్ హాఫ్ రైట్ కాని ఫస్ట్ హాఫ్ రాంగ్
రేటింగ్ : 2.5/5

reviewed by :Malyala Narsa reddy

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here