RGV పవర్ స్టార్ సినిమా రివ్యూ

ఎన్నో వివాదాల మధ్య ఈ రోజు విడుదల అయిన RGV పవర్ స్టార్ సినిమా రివ్యూ ని ప్రముఖ దర్శకుడు హృదయ కాలేయం,కొబ్బరిమట్ట సినిమాల సృష్టికర్త సాయి రాజేష్ మాటల్లో సినిమా ఎలా ఉందో చూద్దాం…

ఇప్పుడే RGV’s Power Star చూసాను….అరె… ఇది బాగుందే… మనం ఏదో అనుకుంటే…మరేదో ఉందే అనుకునేలాంటి 35 నిముషాల సినిమా…

మొదటి 25 నిమిషాలు పవర్ స్టార్ ఓటమి కి కారణాలు, వ్యక్తులు… వాళ్ళ భజన, manipulation అంటూ ఏవో చూపించారు…surprisingly.. ..ఆ part అంతా బోర్ కొట్టకపోవటం ఒక వింత… అందులో నిజాలు ఎంతో….ఎవరికీ తెలీదు…కానీ వీళ్ళ వల్లే ఆయన ఓటమి పాలయ్యారు అనే ఒక Sympathetic expression ని జనాలకి చూపించారు…

చివరి 10 నిముషాలు …ఎక్కువ మందిని సర్ప్రైజ్ చేస్తుంది….RGV entry……తను ఎంత గొప్ప పవన్ కళ్యాణ్ అభిమానిని… ప్రవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కంటే తనే గొప్ప ఫ్యాన్న్ని అని…పార్టీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి…కళ్యాణ్ చుట్టూ వున్న భజన బ్యాచ్…అర్థం పర్థం లేని elementary school స్టాండర్డ్ సిద్ధాంతాలు ఎవరో రాసిస్తే… అది నమ్మేసారని…ఇప్పటికైనా మారండి అని…మారితే మీరే CM అంటూ చెప్తారు…తన మాటలు అర్థం చేసుకున్న ప్రవన్ కళ్యాణ్….RGV తన real well wisher గా భావించి… కౌగిలించుకోవటం తో షార్ట్ (ఫిల్మ్ ) ముగుస్తుంది…

ఇది…చాలా అద్భుతమైన సర్రేయాలిస్టిక్ ఇంటెలిజెన్స్ నుంచి తియ్యబడ్డ ఒక manipulative ఫిల్మ్…..తత్వవేత్త Bigoskr Chsndarin చెప్పనట్టుగా “అబద్ధం కూడా చాలా నిజాయితీ గా చెప్పినప్పుడు… అందులోని నిజాన్ని, sarcasm ని, flirting ని అర్థం చేసుకోలేని ఒక బలహీనమైన వ్యక్తి ఎప్పుడూ ఉంటాడు” అని ఈ సినిమా చెప్తుంది..

అర్థం కాలేదా….RGV ఇదే పని చేసాడు.. సినిమా చూసినప్పుడు మీకు భలే చెప్పాడు కదా అని surprising గా Pawan కళ్యాణ్ ఫాన్స్ కి కూడా అనిపిస్తుంది… మా బాధ కరెక్ట్ గా చెప్పాడు.. మా అన్న ని మోసం చేశారు..లేకపోతే తనే CM… RGV కరెక్ట్ గా చెప్పాడు అని ఫ్యాన్స్…. సిద్ధాంత పరంగా ఎంత బాగా analysis చేసాడో…ఎంత ధైర్యంగా నిజాలు చెప్పాడో అని క్రిటిక్స్ కి అనిపిస్తది…

కానీ వాళ్ళకి తెలీనది ఏంటంటే….హీరో చుట్టూ వున్న జనాల భజన వల్లే…హీరో ఓడిపోయాడు అంటూ…చివరి 10 నిమిషాలు RGV నిజాయితీగా చెప్పినట్టుగా అనిపించే భజన ఏదైతే వుందో… అదే పెద్ద manipulation…. అర్థం ఉందొ లేదో తెలీని…vocabulary ని …ఎలాగూ వెతికే ధైర్యం చేయరు అని…తన స్టైల్ ఆఫ్ sarcasm ని వదిలాడు..

నువ్వు అద్భుతమైన అందగత్తెవి కాదు…
నీ శరీరాకృతి శిల్పం ల మలిచినట్టు ఉండదు…ఈ ప్రపంచం నిన్ను చేరదీయకపోవచ్చు….అందులో కొంత నిజం ఉండొచ్చు…కానీ నీలో ఏదో అద్భుతం ఉంది…నాకు కావాల్సింది నీ శరీరం కాదు, నీ దగ్గరతనం అని ఒక పెళ్లయిన స్త్రీ ని నీకు నేను నిజం చెప్తున్నా, నేను మాత్రమే నిన్ను అర్థం చేసుకున్నా…అని flirt చేసే డిగ్రీ కుర్రాడి కుర్రాతనం కనిపిస్తుంది RGV లో…
పడే వాళ్ళు పడతారు…కొందరు ఇదిగో నాలా..

He wants to enjoy the effect he created around “Power Star” … గొర్రెలు పడ్డారు అని వోడ్కా తాగుతూ తను నవ్వుకుంటూ వుండొచ్చు…..ఆ నవ్వు ని గమనిస్తూ నేను విస్కీ లేపొచ్చు..

Read this review after watching the (short) film… Then u may understand my view..

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close