కేసీఆర్ ఊరిలో రేవంత్ కి పరాభవం

0
538
reventhreddy arrested in kcr village
reventhreddy arrested in kcr village

తెలంగాణా ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్ష నాయకులలో రేవంత్ రెడ్డి రూటే వేరు. ఈ మధ్య రైతు ఆత్మహత్యల గురించి TDP నేత రేవంత్ రెడ్డి చాలా బాదపడుతునట్లు అనిపిస్తుంది. ఇది రాజకీయ ఉద్దేశ్యమో లేక మరే ఉద్దేశ్యమో తెలియదు కానీ ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఅర్ స్వంత గ్రామం చింతమడకలో ఆత్మహత్య చేసుకున్న ఒక రైతు కుటుంబాన్ని పరామర్శించదలిచాడు. ఇక ఆ ఊరికి పరామర్శ పేరుతో బయలుదేరాడు. రేవంత్ రెడ్డి పర్యటన ఆ ఊరి ప్రజలకి నచ్చలేదు అనుకుంటా, వెంటనే గ్రామానికి వచ్చే అన్ని దారులని మూసివేసారు. దీనితో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రేవంత్ రెడ్డిని అక్కడికి రాకుండ పోలిసులు అడ్డుకున్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు జరిగినప్పుడు కనబడని రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసిఆర్ స్వంత గ్రామంలో పర్యటించడం రాజకీయ దురుద్యేశమని స్థానికులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here