యూపీలో బీజేపీని గెలిపించిన 9 కారణాలు

0
539

1) బాబ్రీ మసీద్ కూల్చివేత తరువాత ఉత్తర ప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువ కనిపించేది. దేశములో ఏ రాష్ట్రంలో అయినా కూడా ఏదేని ఒక ప్రాంతీయ పార్టీ మాత్రమే బలంగా ఉంటుంది కానీ తమిళనాడు ,యూపీలో మాత్రం రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండి జాతీయ పార్టీలను బోర్డర్ దగ్గరే ఉన్నాయి కానీ రాష్టంలో బలపడకుండా చేశారు అక్కడి ప్రజలు. యూపీలో కూడా ఒక వైపు బలమైన సమాజ్వాదీ పార్టీ మరో వైపు బహుజన సమాజ్ వాది పార్టీ ప్రతి ఎన్నికల్లో అధికారాన్ని బదిలీ చేసుకున్నారు. అధికారంలో ఉన్న పార్టీ కి వ్యతిరేకత వస్తే రెండో పార్టీలకు అధికారాన్ని ఇచ్చేవారు . ఈ సారి సమాజ్వాదీ పార్టీ కున్న ప్రజల్లో వ్యతిరేకతను బీఎస్పీ ఉపయోగించుకోవడంలో పూర్తిగా విఫలం అయింది దీన్ని బీజేపీ పూర్తిగా ఉపయోగించుకుంది.

2) వాస్తవానికి ఈ సారి సమాజావాది పార్టీ కి గతంలో కన్నా పెద్ద వ్యతిరేకత లేదు కాని కుటుంబ కలహాల వలన ఈ పార్టీ పూర్తిగా బజారుకెక్కింది. దీని వలన అఖిలేష్ యాదవ్ పైన ఉన్న క్లీన్ ఇమేజ్ కూడా డామేజ్ అయిపొయింది. ఈ కుటుంబ కలహాల అవకాశాన్ని బిజెపి పూర్తిగా తమకు పాజిటివ్ గా మార్చుకుంది.

3) ఇవన్నీ చాలవన్నట్లు ఎస్పీ కాంగ్రెస్ ల కలయిక ప్రజలకు ఒక కృత్రిమ కలయిక లాగా కనిపించింది. దానికి తోడు రాహుల్ కి ఉన్న అసమర్థ ఇమేజ్ అఖిలేష్ కి శాపంలాగా మారిపోయింది.

4) గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజీపీకి మెజారిటీ ఎంపీలు గెలవటం వలన అప్పటి నుంచి బీజీపీ టార్గెట్ 2017 వ్యూహంతో పనిచేసి తమ పార్టీ సంస్థాగతలను బలపర్చుకుంది.

5) యూపీలో అగ్రవర్ణాలు అయిన బ్రాహ్మిన్ల ఓట్లు ,ఠాగూర్ల ఓట్లు కీలకమైనవి. ప్రతి ఎన్నికల్లో ఎదో ఒక పార్టీకి మద్ధతు ఇచ్చే వీళ్ళ ఓట్లను ఈ సారి బీజేపీ ఒక అస్త్రంతో చేజిక్కించుకుంది. ఆ అస్త్రం ఏంటో తెలుసా ?సోషల్ మార్కెటింగ్. స్వతహాగా విద్యావంతులు అయినా వీళ్ళు

ఫేస్బుక్ ,ట్విట్టర్లు బాగా ఉపయోగిస్తున్నారని బీజీపీ తెలుసుకుంది. దీనితో సోషల్ ప్రచారంలో మంచి టీం ఉన్న బిజెపి వీళ్ళను తమ వైపు తిప్పుకుంది.

6) బిజెపి అప్నా దళ్ ,సుహుల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ లతో పొత్తు పెట్టుకుకోవటం కలిసివచ్చింది. ఎందుకంటే పురవంచల్ ,మధ్య ఉత్తర ప్రదేశ్ లో బలమైన సామజిక వర్గం అయినా కూర్మి పటేళ్లను అప్నాదల్ ప్రాతినిధ్యం వహిస్తే ,సుహుల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఏమో రాష్ట్రంలో 18శాతం ఉన్న రాజబర్ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రాజభర్ అంటే తూర్పు ఉత్తర ప్రదేశ్ లో 17 ఉపకులాలతో కూడిన ఒక సామజిక వర్గం.

7) బీఎస్పీ లోని బలమైన నాయకులను బిజెపి తన వైపు పూర్తిగా తిప్పుకుంది.2007 లో బీఎస్పీ మంత్రం అయిన దళిత్-బ్రాహ్మిన్ కూటమిని తన వైపు తిప్పుకుంది.

8) బీజేపీ గెలుపుకు ప్రధాన కారణం హిందుత్వ అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక్క ముస్లిం అభ్యర్థి కి కూడా టికెట్ ఇవ్వకుండా హిందువులను తమవైపు తిప్పుకుంది. కాంగ్రెస్ ,సమాజ్వాదీ పార్టీలతో బిజెపి పూర్తిగా హిందుత్వ పార్టీ అని ప్రచారం చేయటం వలన హిందువులు పూర్తిగా బీజేపీ వైపు వచ్చారు. దానికి తోడు సమాజ్వాదీ పార్టీ రంజాన్ పండుగకు ఇచ్చిన ప్రాధాన్యత diwaliకి ఇవ్వలేదని ప్రచారంలో బిజెపి సక్సెస్ అయిందని చెప్పొచ్చు.

9) సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం కూడా బిజెపికి కలిసివచ్చింది అని చెప్పొచ్చు. దీనివలన ఆయా సామజిక వర్గాల వారు వాళ్ళ కులానికి సీఎం పోస్ట్ వచ్చే చాన్సు ఉంటుందని కలిసి పని చేశారు. బీహార్లో చేసిన తప్పును ఈ సారి చేయకుండా జాగ్రత్త పడ్డారు.

ఏది ఏమైనా యూపీలో బిజెపి గెలుపుకు తమ బలాలతో పాటు ప్రత్యర్థుల బలహీనతలు కూడా గెలిపించాయని తెలిసిపోతుంది.

 

Author: Ravinder Ryada

#Assembly Polls 2017, #UP Assembly Polls

 
https://www.youtube.com/watch?v=92l90thwZGk
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here