రిజర్వేషన్ల మీద జగన్ యూ టర్న్ వెనుక అసలు వాస్తవం…

0
2560

రాష్ట్రం విడిపోయాక తెలుగు రాజకీయాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉన్నాయని చెప్పొచ్చు. తెలంగాణ లో మొదట్లో పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉండేవి 3 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి ,బీజీపీ లక్ష్మణ్ ల ప్రభావం కొంచెం కనబడి అపుడపుడు రసకంద రాజకీయాలను చూశాం. కాని ఆంధ్రలో మాత్రం ప్రభుత్వం ఏర్పడిన సమయం నుంచి ఎన్నికల మందు ఎలాంటి రాజకీయాలు ఉండాలో అలాంటి మాసాల రాజకీయాలు దర్శనమిస్తూ ఉన్నాయని చెప్పొచ్చు. ఉదుద్ తూఫాన్ , గోదావరి పుష్కరాలలో సందర్శకుల మరణం ,కాపు రిజెర్వేషన్ల ఉద్యమంలో భాగంగా తుని ఘటన,కాల్ మనీ ,వనజాక్షి వివాదం,పవన్ శ్రీరెడ్డి వివాదం ,కత్తి మహేష్ పవన్ వివాదం,రోజా అసెంబ్లీ బహిష్కారణ ,ప్రత్యేక హోదా ఉద్యమం ,పవన్ కళ్యాణ్ టీడీపీ తెగదెంపులు,బీజీపీ టిడిపి తెగతెంపులు,జగన్ పాద యాత్ర,పవన్ పోరాట యాత్ర ..ఇలా ఆంధ్ర రాజకీయాల్లో రోజు ఎదో ఒక వివాదం ఉంటూనే ఉంది. అయితే ఎన్నికలు సమీపించిన కొలది అక్కడి రాజకీయాలు పూర్తిగా రంజుకుంటున్నాయి అని చెప్పొచ్చు.

అప్పటి వరకు టిడిపి -వైయస్సార్ పార్టీల మధ్య ఉన్న రాజకీయాలు గత 10 రోజులుగా మాత్రం వైయస్సార్ -జనసేన లకు మారిపోయిందని విశ్లేషకుల అభిప్రాయం. ప్రధానంగా జగన్ ప్రెస్ మీట్ లో పవన్ పెళ్లిళ్ల గురుంచి ప్రస్తావిస్తూ పవన్ కు విలువలు లేవని చెప్పటం తర్వాత రెండు వర్గాలు సోషల్ మీడియా లో కొట్టుకోవటం తారాస్థాయికి చేరిపోయాయి. మళ్ళి నిన్న జరిగిన మరో ప్రెస్ మీట్ లో కాపు రిజర్వేషన్లు సాధ్యపడవని అది కేంద్ర పరిధిలో ఉంటాయని స్పష్టం చేశారు.

అయితే గతంలో రిజర్వేషన్లకు మద్దతు పల్కిన జగన్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకువటంపై ఆంధ్ర ప్రజలు అయోమయంలో పడిపోయారు.ఐతే విశ్లేషకులు మాత్రం జగన్ వ్యూహం ప్రకారమే ఈ 2 పరిణామాలు జరిగాయని చెబుతున్నారు. ఇదే కాకుండా వంగవీటి రంగా కు వ్యతిరేకంగా మాట్లాడిన గౌతమ్ రెడ్డి ని పార్టీలో చేర్చుకోవటం కూడా వ్యూహంలో భాగమే అని చెబుతున్నారు. ఆంధ్రలో కాపులు ఎక్కువగా ఉండటంతో ఆ ఓట్లు జగన్ కి రావని మెజారిటీ ఓట్లు జనసేన కు పడతాయని జగన్ అంచన. కాపులు బలంగా ఉన్న చోట మిగతా బిసి వర్గాలకు ఎప్పటి నుంచో వైరం ఉండటంతో కాపు వ్యతిరేఖ ఓట్లు టిడిపికి పడకుండా వైయస్సార్ కాంగ్రెస్ కి పడేలా చేయాలంటే పవన్ కళ్యాణ్ ని తిట్టి ,కాపులకు మేము దూరంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం అని విశ్లేషకుల అంచనా. ఈ సంఘటనల్లో టిడిపి ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండటం కొసమెరుపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here