దిశ నిందితుల మీద ఎన్కౌంటర్ కి ఆ ఫోన్ కాల్ కారణమా?

0
50

రోజు దేశంలో ఎంతో మంది అమ్మాయిలు కీచకుల అఘాయిత్యానికి బలైపోతున్నారు కాని 7 ఏళ్ల క్రీతం ఢిల్లీలో జరిగిన సంఘటన,ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఘటనలు మాత్రం దేశంలో ట్రేండింగ్ వార్తలు గా చెలామణి అయ్యి మిగతా ఘటనల కన్నా ఎక్కువ అందరికి గుర్తిండిపోయేలా చేశాయి.ప్రదానంగా హైదరాబాద్ లో జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో అందరికి కన్నీరు తెప్పించింది. ఒకే ఒక్క కారణం వల్ల మిగతా ఘటనల కన్నా ఎక్కువ జనాలను,ప్రభుత్వాలను ,పోలీసులను ,మీడియా ను,సోషల్ మీడియా ను కలిచివేసింది.ఆ కలిచివేత చివరికి నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసే విదంగా పోలీసులను ప్రభావితం చేసింది.పోలీసులు కూడా మిగతా కేసుల కన్న ఎక్కువ ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనాలను సంతోషపడేలా చేశాయి.

ఆ కారణాల్లో ఒకటి అమ్మాయిని హైదేరాబాద్ ఐటీ హబ్ కి దగ్గరలో అత్యాచారం చేసి దారుణంగా దహనం చేయటం.రెండవ కారణం దిశ చనిపోయే ముందు వాళ్ళ చెల్లి తో చేసిన ఫోన్ సంభాషణ.ఈ ఫోన్ సంభాషణ విన్న ప్రతి తెలుగు వాళ్ళలో దిశ పైన సానుభూతి,నిందితులను వెంటనే ఉరి తీయలనే కోపం దాదాపు అందరి మెదళ్లలో మెదిలింది.వీరికి సోషల్ మీడియా తోడు కావటంతో అన్ని న్యూస్ ల కన్న వైరల్ అయి టాక్ ఆఫ్ ద తెలుగు స్టేట్స్ గా మారి తెలంగాణ పోలీసులకు దేశంలో చెడ్డ పేరు వచ్చే పరిస్తుతులు కనబడ్డాయి. కేసుని చాలా అక్టీవ్ గా నడిపించి నిందితులను తొందరగానే కస్టడీలోకి తీసుకున్నారు.కాని అనుకోకుండా ఈ రోజు ప్రొద్దున నిందితులు పారిపోతుండగా ఎన్కౌంటరు చేయటం జరిగింది.

ఏది ఏమైనా దిశ చెల్లి ఫోన్ కాల్ వల్ల మిగతా కేసుల కన్నా ఎక్కువ ఈ కేసుకు ప్రాధాన్యత తెచ్చింది అనటంలో సందేహం లేదు.

దిశా తన చెల్లి కి చేసిన ఫోన్ కాల్ తన ప్రాణాన్ని కపడలేకపోయినా తనను చంపిన నిందితుల ఎన్కౌంటర్ కి పరోక్షంగా కారణం అయి తన ఆత్మకు శాంతి చేకూర్చింది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here