నిర్మల్ చెరువులు..కబ్జాలు..హైకోర్టు తీర్పులు ..కూల్చివేతలు ..వాస్తవాలు..

176 0

 

వారసత్వంగా నిర్మల్ పట్టణంలోని రాజులు కట్టించిన గొలుసు కట్ట చెరువుల కబ్జాల వార్తలు మనందరికీ సర్వ సాధారణంగా వినిపించేవే…ఇటీవలె నిర్మల్ పట్టణంలోని కురన్నపేట్ చేరువుకుడా దారుణంగా కబ్జాకు గురవడం దానిపై అధికారాలు..నాయకులు కుమ్ముక్కయి మౌనం దాల్చడంతో…. కొందరు పర్యావరణ ప్రేమికులు నిర్మల్ లోని అన్ని చెరువులలోని ఆక్రమణలను తీసేసి కాపాడాలని ప్రజా ప్రయోజనాల పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.

దీనికి సంబంధించిన కేసులో గతంలోనే అన్ని చేరువులలో ఉన్న ఆక్రమణలను తక్షణమే తొలగించాలని హైకోర్టు అర్దరు ఇవ్వడం జరిగింది. అయినా కూడా కంచరోని చెరువు శిఖంలో నిర్మాణాలు జరుగుతుండటంతో జిల్లా కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసి రేపు అనగా అక్టోబర్ 12 వ తేదీన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిందిగా కలెక్టర్ ను ఆదేశించింది.
ఇప్పుడే రాజకీయం మొదలైంది కలెక్టర్ గారు రేపు కోర్టులో ఆక్రమణలు తొలగించినట్టుగా హైకోర్టుకు సంతృప్తి కలిగించాలి అంటే ఎవరి ఆక్రమణలు కూల్చాలి…??
సంవత్సరం కింద హైకోర్టు వెంకటాద్రిపెట్ వాసులు వేసిన కేసులో ఖజానా చెరువు ఆక్రమణలు తొలగించాలని ఇచ్చిన తీర్పు ఉంది …కాని ఆ ఆక్రమణను కలెక్టర్ గారు ముట్టలేదు….కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కంచరోని చెరువులో ఒక పెద్ద స్కూల్ ..మరియు ఎన్నో అక్రమ కట్టడాలు ఉన్నాయి వాటిని ముట్టలేదు…మరియు నిర్మల్ పట్టణంలో ఎన్నో చెరువులు ఎన్నో అక్రమ కట్టడాలు కానీ వేటినీ ముట్టకుండా.. ప్రజలకు ఉపయోగపడే మరియు ..” హైకోర్టు కేసు లో పిటిషన్ లో లేని కుల సంఘాలనే ” ఎందుకు టార్గెట్ చేసిండ్రు…??
బలమైన కులసంఘాల ఆస్తులపై దాడులు చేస్తే సమాజంలో పిటిషన్ వేసిన వారి పై అసంతృప్తి పెరుగుతుంది …కోర్టులలో కూడా కబ్జాదారులను కాపడవచ్చు.. పిటిషనర్ లక్ష్యాన్ని…ప్రజలను ..కోర్టులను తప్పుదోవ పట్టించి కబ్జాదారులను కాపడవచ్చు ఇదీ ప్లాన్…
దయచేసి నిర్మల్ విజ్ఞులైన నిర్మల్ ప్రజలారా ఆలోచించండి …కబ్జాదారుల ముసుగులు తొలగించండి..

Related Post

ఆర్మూర్ శ్రావణ్ కి ఉత్తమ సామాజికవేత్త అవార్డ్

వరంగల్ లోని తార గార్డెన్ లో తెలంగాణ జ్వాల,మున్నూరు కాపు మాసపత్రిక సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ అవార్డ్ ఫంక్షన్ లో సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఉపాధ్యక్షుడు ,బాచుపల్లి…

50 మంది వలస కూలీలకు సహాయం చేసిన తెలంగాణ విఠల్

Posted by - April 13, 2020 0
హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లాలో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన 50మంది వలస కూలీల కోసం బియ్యం, పప్పులు మరియు నిత్యావసర సరకులను పంపిణీ చేసిన…

సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆద్వర్యంలో నల్గొండ ఉమ్మడి జిల్లాలోని రైతులతో జూమ్ virtual సమావేశం

ఇటివల పడ్డ భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు సంబంధించిన విషయాలను ఈ రోజు సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సంస్థ అద్వరంలో,గ్లోబల్ అధ్యక్షుడు రవీందర్ ర్యాడ,సూర్యాపేట జిల్లా కన్వెనర్…

మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర హోమ్ మంత్రి చేతుల మీద తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ హోమ్ మంత్రి మహుముద్ అలీ చేతుల మీదుగా తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ఆవిష్కరణ మినిస్టర్ క్వార్టర్స్ లో జరిగింది.ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు శ్రీనివాస్…

గల్ఫ్ అంశంలో రెండవ ఉత్తరం పంపిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్

Posted by - April 24, 2020 0
స్వగ్రామలకు తిరిగిరావడానికి సిద్ధంగా ఉన్న కార్మికులకు ప్రభుత్వం ఉచితంగా విమాన ప్రయాణం కల్పించాలి* గల్ఫ్ దేశాలలో ఉపాధి నిమిత్తం వేములవాడ నియోజకవర్గం మరియు తెలంగాణ రాష్ట్రం అన్ని…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *