రూ.2000 నోటు ముద్ర‌ణ‌ను నిలిపివేసిన RBI…

0
310
RBI stops printing Rs 2000 notes
RBI stops printing Rs 2000 notes

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్తగా తీసుకొచ్చిన రూ.2000 నోటు ప్రింటింగ్ నిలిపేసింది. దాని స్థానంలో కొత్త రూ.200 నోటు ముద్ర‌ణ‌ను పెంచిన‌ట్లు లైవ్‌మింట్ వెల్ల‌డించింది. ఐదు నెల‌ల కింద‌టే రూ.2000 నోటు ముద్ర‌ణను ఆర్బీఐ నిలిపేసిందని… ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో మ‌ళ్లీ ముద్రించే అవ‌కాశాలు లేవ‌ని నివేదిక స్ప‌ష్టంచేసింది. మైసూర్‌లోని ఆర్బీఐ ప్రింటింగ్ ప్రెస్ లో రూ.200 నోటు ముద్ర‌ణ‌ పని వేగంగా సాగుతోంది. ఆగస్ట్ నెలలో మార్కెట్ లోకి ఈ రూ.200 నోటు రాబోతున్నది. చిల్లర క‌ష్టాల‌ను అధిగ‌మించ‌డానికి కొత్త‌గా రూ.200 నోటును తీసుకురావాల‌ని ఆర్బీఐ గ‌త మార్చిలోనే నిర్ణ‌యించింది. అయితే రూ.2000 నోటు ముద్ర‌ణ ఆగినా కూడా మార్కెట్లో అవి చెలామ‌ణి అవుతాయని ప్ర‌జ‌లు దీనిపై ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here