హైద్రాబాదు వరద బాధితులకు సినిమా వాళ్ళ చిన్న చూపు ఉందని సోషల్ మీడియా లో వస్తున్నా విమర్శలకు రామ్ చరణ్ చెక్ పెట్టాడు. సమస్యలకు చారిటి విషయంలో మొదటి నుంచి ముందు ఉండే చరణ్ ఈ సారి కూడా తన వ్యక్తిత్వం అంటే మరోసారి నిరూపించాడు. హుదూద్ తూఫాన్ సమయంలో అందరికన్నా ముందు తన విరాళాన్ని ప్రకటించిన చరణ్ చెన్నయ్ వరదలకు తెలుగు హీరోల్లో మొదటి హీరోగా పేరుగాంచాడు. ఐఫా అవార్డుల్లో ఎప్పుడు లేని విదంగా ఒక తెలుగు హీరో స్టేజి పైన డాన్సు చేసి డబ్బుని చెన్నయ్ బాధితులకు ఇచ్చాడు. ఇపుడు హైదరాబాద్ బాధితులకు 3 రోజులకు గాను పిల్లలకు ఉచిత ఆహారాన్ని స్పాన్సర్ చేసి శబాష్ అనిపించుకున్నాడు. చరణ్ ఉపాసన కలిసి వరద బాధితులకు కష్టం కాకుండా చూస్తున్నారు. అన్నట్లు రాజమౌళి కూడా దుప్పట్లు డొనేట్ చేసాడు.