గిన్నిస్ చరిత్రని తిరగరాస్తున్న మగధీరుడు

1
430

5 ఏళ్ల క్రీతం మగదీర సినిమా తో టాలీవుడ్ చరిత్ర ని తిరగరాసి తర్వాత దాదాపు అన్ని సినిమాలతో 40 కోట్ల క్లబ్ లోకి చేరి అరుదైన చరిత్ర సృష్టించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరొక రికార్డు సృష్టించటానికి సన్నాహం అవుతున్నాడు . కాని ఇప్పటి వరకు అయన రికార్డులు అయన సినిమాల్లోని నటన ,డాన్సు లు ,కలెక్షన్లతో బాక్స్ ఆఫీసు వద్ద సృష్టించిన చరణ్ ఈ సరి ఆ బాద్యత ని అయన ఆభిమానులు సృష్టించబోతున్నారు . అది ఎలాగో తెలుసుకోవాలని ఉందా ఐతే ఒకసారి వివరాల్లోకి వెళ్దాం .
మార్చ్ 27 న మెగాస్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు అని అందరికి తెలిసిన విషయమే . ఐతే అయన అభిమానులు ఒక గణమైన బహుమతి ని ఇవ్వబోతున్నారు . ప్రతి మెగా హీరో పుట్టిన రోజుకి రక్త దానం చేసి అభిమానాన్ని నిరుపించుకుంటారు . ఐతే ఈ సరి చరణ్ పుట్టిన రోజున 1,11,000 యూనిట్ ల రక్తాన్ని దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు రక్తాన్ని దానం చేయనున్నారు . ఏంటి చేస్తే లక్ష యూనిట్ చేయాలి కాని 1,11,000 అనే సంఖ్యా ఏంటని అనుకుంటున్నారా ?అవును కచ్చితంగా ఈ సంఖ్యా చాల ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ సంఖ్య లో రక్తాన్ని దానం చేస్తే గిన్నిస్ బుక్ లో ఇప్పటి వరకు ఉన్న 1,10,000 యూనిట్ ల రక్తాన్ని ఒకేరోజు చేసి దానం చేసిన రికార్డు ఉంది ,దాన్ని మన చరణ్ అభిమానులు బ్రేక్ చేయనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ముఖ్య నగరాల్లో, పట్టణాల్లో బ్లడ్ క్యాంపు లు పెట్టి దీన్ని నిర్వహిస్తారు . ఈ కార్యక్రమాన్ని అల్ ఇండియా చిరంజీవి యువత అధ్వర్యంలో నిర్వహించనున్నారు . దీనికి ఆయ రాష్ర గవర్నర్ లు ముఖ్య అతిధి గా విచ్చేసి క్యాంపు లను ప్రారంబిస్తారని అల్ ఇండియా చిరంజీవి యువత ప్రెసిడెంట్ స్వామి నాయుడు గారు గత నెల 31 న జరిగిన సమావేశంలో నిర్ణహించినట్లు తెలంగాణా కబుర్లు కి ఒక ప్రకటనలో తెలిపారు.

swaminaidu

స్వామి నాయుడు గారు మాట్లాడుతూ ” మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజున మా అభిమానులం కలిసి ఇచ్చే బహుమతి ఇది ,దీనికి మా కమిటి లో 80 మంది సభ్యులం ఈ లక్ష్యాన్ని చేదిస్తామని ప్రతిజ్ఞ చేసాము , దీనికి సంబందించి రక్త దానం చేయాల్సిన అభిమానుల వివరాలు రిజిస్టర్ చేయటానికి ఈ రోజు www.megablooddonors.com ని అవిష్కరిస్తున్నాము ,ఈ కార్యక్రమాన్ని ప్రాంతాల వారిగా ఉన్న అభిమానులకు చేరవేయటానికి మా అదికారిక ప్రతినిది ch ,ధర్మేంద్ర గారు ముఖ్య బూమిక పోషించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ,మన అభిమాన హీరో కి జీవితంలో గుర్తుండిపోయే బహుమతి ఇవ్వాలని కోరుతున్నాము “. ఈ కార్యక్రమంలో ఆంద్ర ప్రదేశ్ ప్రెసిడెంట్ ప్రసాద్ రెడ్డి ,అదికారిక ప్రతినిధులు ధర్మేంద్ర,నాగేంద్ర ,తమిళనాడు అద్యక్షుడు నగేష్ ,తెలంగాణా అద్యక్షుడు ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు .

ఈ సమావేశంలోని సైడ్ లైట్స్

1) ఇది అల్ ఇండియా చిరంజీవి యువత యొక్క కార్పొరేట్ లెవెల్ సమావేశం
2) రామ్ చరణ్ పుట్టిన రోజున 1,11,000 యూనిట్ ల రక్తాన్ని సేకరించి గిన్నిస్ రికార్డు నెలకొల్పుతామని సభ్యులందరూ ప్రతిజ్ఞ చేసారు.
3) ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ల కోసం www.megablooddonors.com అనే వెబ్ సైట్ ఆవిష్కరణ
4) లక్ష్యాన్ని సాదించటానికి జిల్లాల వారిగా కార్యాచరణ ,ఆయా జిల్లాల వారిగా బాద్యతలు అప్పగింత

ఏది ఏమైనా అభిమానులందు మెగా అభిమానులు వేరయా అని నిరుపిస్తున్న మెగా అభిమానులకి అల్ ది బెస్ట్ .

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here