రామాయణంలో తుపాకుల వేట -యూట్యూబ్ లో క్లిక్కుల పరంపర

0
739

ఈ మధ్య యూట్యూబ్ లో చాలా షార్ట్ ఫిల్ములు వస్తున్నాయి,కెమెరా కొనుక్కొని ఒక స్క్రిప్ట్ రాసుకొని ఫ్రెండ్స్ తో కలిసి షూట్ చేసి తనకున్న మాక్ కంప్యూటర్ తో ఎడిటింగ్ ,మిక్సింగ్ ,దుబ్బింగ్ చేసేసి మంచి డిజిటల్ మార్కెటింగ్ సంస్థ తో ఒప్పందం కుదుర్చుకొని విడుదల చేస్తున్నారు. వాటిలో చాలా వరకు రొటీన్ సినిమాలు కనిపిస్తున్నాయి కానీ కొన్ని మాత్రం మన ఆలోచనలను ఆపేసి పనులను ఆపేసి ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లాయి. ఇలాంటి కోవలోకే వస్తుంది. రామాయణంలో తుపాకుల వేట. జయశంకర్ తీసిన ఈ సినిమా టైటిల్ చూడగానే ఇదేదో క్రైమ్ సినిమా అనుకుంటాం .కానీ చూస్తే కానీ తెలియదు రక్తం బొట్టు చూపించకుండా అంతకు మించిన భయాన్ని చూపించాడు. సమాజంలో జరుగుతున్న ఒక అరాచకాన్ని చూయిస్తూ సందేశం అని టాగ్ చేసి చెప్పకుండానే యువతులకు హెచ్చరిక జారీ చేసాడు.రిలేషన్ షిప్ లో అబద్దాలు ఉండొచ్చు కానీ సీక్రెట్స్ ఉండకూడదు,అమ్మాయిలు బెదిరింపులకు లొంగరేమో కానీ మాటలకు పడిపోతారు ,అన్ని చూసిన అమ్మాయితో సినిమాలు చూడటం చాల చిరాకు  లాంటి డైలాగులు పేలాయి.

15 నిమిషాల వ్యవధిలో ఏం జరుగుతుందో అని కొంచెం కూడా సందేహం రాకుండా కథను బాగా తెరకెక్కించాడు. అక్కడడక్కడ చాణక్యుడి సూక్తులు,పురాణాల పుస్తకాలు చూయిస్తూ తనకున్న టాలెంట్ ని బయట పెట్టాడు. నటించిన నటులు… క్షమించాలి.. జీవించిన పాత్రలు రక్తి కట్టించాయి. దానికి తగ్గట్టు రాజా అందించిన నేపథ్య సంగీతం ఒక కమర్షియల్ సినిమాకు అందించిన విదంగా ఉంది.
మారుతున్న జీవనశైలికి ఒక చెంప పెట్టు లాంటి సినిమా. చివరగా ఇది అందరు చూడాల్సిన షార్ట్ ఫిలిం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here