కాపుల్లో ఐక్యత పెంచుతున్న వర్మ?

0
432

వంగవీటి మోహన రంగ హత్య 80వ దశకంలో విజయవాడనే కాదు తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపింది. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కి అండగా ఉన్న కాపులు ఒక్కసారిగా యూ టర్న్ తీసుకోవటంతో కాంగ్రెస్ భారీ మెజారిటీ తో గెలిచింది. నిజానికి అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం చాల మంచి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన కూడా రంగా హత్యతో వచ్చిన సానుభూతి ముందు అవేమి పనికిరాలేదు. నిజానికి రంగా కూడా ఒక వర్గానికి కాపు కాయకుండా బడుగు వర్గాల ప్రజలకు ,బెజవాడలో రిక్షా కార్మికులకు అండగా ఉండటం వలనే తెదేపా కి చేదు ఫలితాన్ని ఇచ్చిందని విశ్లేషకులు చెబుతారు.

దాదాపు 30 ఏళ్ల తర్వాత ఏస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసిన వంగవీటి సినిమా పైన దుమారం రేగింది. రంగా ని తక్కువ చేసి రౌడీలా మాత్రమే చూయించాడని ,అయన చేసిన మంచి పనుల పైన పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.వర్మ ఎప్పుడు జీవిత చరిత్రలు తీసినా కూడా చనిపోయిన వాళ్ళను చెడ్డగా ,బతికి ఉన్న వాళ్ళను మంచిగా చూయిస్తాడని ఆరోపణ చేస్తున్నారు. ఈ విషయంలో అయన పైన హ్యూమన్ రైట్స్ కి పిర్యాదులు ,పోలీస్ కేసులు బాగానే నమోదయ్యాయి. వర్మ ఈ వ్యవహారంలో ఒక ముందడుగు వేసి టీవీ షోలలో వంగవీటి రాదా ని చిన్నపిల్లాడిలా పోలుస్తూ,రంగా ఒక మహాత్ముడు కాడని చెప్పేసాడు. దీనితో రంగ అభిమానుల్లో,కాపు వర్గాల్లో మరింత ఐక్యత పెరిగిందని,ఇది ఇలాగే కొనసాగిస్తే 2019 ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాల్లో టాప్ రేట్ గా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here