తెలంగాణాని మూడో ఏడాదిలోకి స్వాగతం పలికిన వర్షం

0
1329

తెలంగాణా వచ్చి 2 ఏళ్ళు గడిచింది ,గత రెండ ఏళ్లలో ఎన్నో విజయాలు సాదించింది , కరెంటు సమస్యలను అదిగమించటం ,రియల్ రంగం స్త్రిరత్వంలోకి రావటం ,ఇతర రాష్ట్రాలకు వెళుతుందని అనుకున్న సాఫ్ట్ వేర్ రంగం కుడుతపడటమే కాకుండా ఆపిల్ ,అమెజాన్ ,గూగుల్ లాంటి పెద్ద కంపెనీలు హైదరాబాద్ ని రెండవ ప్రధాన కార్యాలయంగా ఎంచుకోవటం , అటు ఫార్మా రంగం ,పారిశ్రామిక విదానం ,సంక్షేమ పథకాలు ,వీటి కన్నా ప్రదానంగా రాజకీయ సుస్తిరత నెలకొల్పటం లాంటి విషయాల్లో విజయాలు సాదించాయి . ఇన్ని ఉన్నా కూడా తెలంగాణా ప్రజలకు ఒక లోటు మిగిలింది . అదే వ్యవసాయ రంగం . మిషన్ కాకతీయ వంటి దేశంలోనే అత్యున్నత కార్యక్రమాన్ని చేపట్టినా కూడా ,గత రెండు ఏళ్లుగా వర్షాలు లేవు. ఒక వేళా మూడో ఏడాది తేడా కొడితే కష్టంగా ఉండేది. కాని మే నెల అల ఎంటర్ అయిందో లేదో మంచి వర్షాలు కురిసాయి . మిగతా రాష్ట్రం లో వర్షాలు అంట పెద్దగా లేకపోయినా కూడా హైదరాబాద్ లో వర్షాలు భారీగా పడేసరికి అందరు ఊపిరి పీల్చుకున్నారు.

ఐతే ఈ రోజు (జూన్ 2 ) న తెలంగాణా లో పండుగలు మొదలైయ్యే ముందు అనగా ఉదయం వర్షం మొదలై రాష్ట్రాన్ని చల్లపర్చింది . ప్రదానంగా సంజీవయ్య పార్క్ దగ్గర ఎగిరేసిన దేశంలోనే అతి పెద్ద జాతీయ జెండా ని లాంగ్ జూమ్ లో చూస్తె చాలు ఈ రోజు వాతావరణం ఎలా ఉందొ తెలుసుకోవటానికి . ఇప్పటి వరకు తెలంగాణా కి మొహం చాటేసిన వర్షం , కెసిఆర్ గారు చేసిన చండి యాగం వలన తెలంగాణా మూడో ఏట ,ప్రకృతి వర్షంతో ఆహ్వానించింది అని ఈ రోజు ఆవిర్బావ సభ కు వచ్చిన సామాన్య ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేసారు .

 

Author: Rajanna Kothinti

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here