బద్రి సినిమా 20 ఏళ్ళు పూర్తి కావడంతో రఘు కుంచె భావోద్వేగాలతో కూడిన ఆర్టికల్

34 0

 

బద్రి సినిమా 20 ఏళ్ళు పూర్తి కావడంతో రఘు కుంచె భావోద్వేగాలతో కూడిన ఆర్టికల్ చదవండి.

 

 

20-4-2000 — Evening 5.30 pm

ఫిలింనగర్లో తన office లో బయట గడ్డిలో కూర్చుని ఉన్నాం …అక్కడ ఒక తెలియని నిశ్శబ్దం …దాన్ని ఛేదిస్తూ మాట్లాడాలని ఉంది ..కానీ ఎదురుగా ఉన్న తన ముఖంలో ఓడిపోయాను అన్న బాధ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది , దాన్ని కట్టడి చేయ గలిగే శక్తీ
ఆ సమయంలో నాకు లేదు …
అతని కళ్ళలో నీళ్లు కూడా ,బయటకి రావడానికి కూడా భయపడుతూ ఆగి ఉన్నాయ్ … ఎందుకంటె వాటికి అతని willpower గురించి తెలుసు కాబట్టి ….

కొంచెం వెనక్కి వెళ్తే –
ఒకటి కాదు రెండు కాదు, 4 ఏళ్ళ కష్టం … ఆ కధ పట్టుకుని ఎలా తిరిగాడో నాకు తెలుసు … అంతకు ముందు 2 సినిమాలు opening జరిగి ఆగిపోయాయి …. ‘కృష్ణ ‘ గారితో ‘థిల్లానా’ అనే సినిమా …
‘సుమన్ ‘గారితో ‘పాండు’ అనే సినిమా . కానీ ఆ మనిషి కృంగిపోలేదు … తిరిగాడు ..తిరిగాడు
.. చెప్పులు అరిగేలా తిరిగాడు .. మొత్తానికి నిర్మాత “త్రివిక్రమరావు”గారి కి ఆ కధ వినిపించి, ఆయన ఆ కధని
“పవన్ కళ్యాణ్ ” గారికి వినిపించగలిగే అవకాశాన్ని సంపాయించాడు -ఆయనకీ వినిపించాడు -Proceed అని అనిపించుకున్నాడు …. ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా
చెప్పిన కధని , చెప్పిన సమయానికి చెప్పినట్టుగానే పూర్తి చేయగలిగాడు ….
April -20-2000 సినిమా విడుదల అయింది … RTC X ROADS లో SANDHYA Theatre లో ఆ సినిమా చూడ్డానికి వెళ్ళాం …పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సందడి చాలా గొప్పగా అనిపించింది …. కానీ సినిమా పూర్తి అయ్యేసరికి …. చిన్న తేడా కొడుతుంది అక్కడి వాతావరణం … సరే మాట్నీ వరకు wait చేద్దామంటే వొద్దు అని filmnagar office కి silent గా వెళ్ళిపోయాడు . మేం అంతా ఇళ్ళకి వెళ్లిపోయాం ….సాయంత్రం ఒకసారి కలుద్దామని office కెళ్ళా …అక్కడి పరిస్థితే నేను ముందు చెప్పింది ….

మొత్తనికి నా నోటి ఒక మాట బయటికి రాగలిగింది ….
” ఏంట్రా పరిస్థితి “….అని
తను అన్నాడు … ఐపోయిందిరా –!
Report చాలా bad … Cinema workout కాదని distributers తేల్చేసారు …. Producer phone తియ్యడం లేదు … మళ్ళీ 0 నుండి మొదలు పెట్టడమే … చేసేదేం లేదు ..అని గడ్డిలో ఆలా వాలిపోయాడు ..ఎలా ఓదార్చాలో తెలియక silent గా ఉండిపోయాను .. ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్లిపోయాం ….
మరునాడు సాయంత్రానికి …
ఆ సినిమా విషయంలో ఒక అద్భుతం జరిగింది … Sudden గా అన్ని చోట్లనుండి అద్భుతమైన Buzz … “బద్రి ” Super Hittt అని reports …. All over Housefuls ani phones అదే distributers నుంచి …..నిర్మాత
త్రివిక్రమరావు గారు రిపోర్ట్స్ పట్టుకుని Puri office కొచ్చారు … ఆయన ఆనందానికి పట్టపగ్గాలు లేవు .. Almost జగన్ ని ఎత్తుకున్నంత పని చేశారు …కళ్యాణ్ గారి దగ్గరనుంచి ఫోన్ … Megastar నుంచి అభినందన సందేశం …
ఆరోజు జగన్ చిన్నపిల్లాడిలా గంతులెయ్యడం నేను చూసాను …ఆ తర్వాత ఆ సినిమా 200 రోజులు ఆడింది … “నువు నందా ఐతే నేను బద్రీ .. బద్రీనాథ్ ” మారుమోగిపోయింది …. నాటి
“బద్రి నుంచి నేటి ఇస్మార్ట్ శంకర్” వరకు … తనది ఒక గొప్ప ప్రయాణం .. ఎంతో ఎత్తుకి ఎదిగాడు … మధ్యలో చాలాసార్లు దెబ్బతిన్నాడు … పడిన ప్రతీసారి అంతకన్నా వేగంగా లేచేవాడు … తను లేస్తూ ఇంకో పదిమందిని లేపేవాడు …
వాడికి తెలిసింది ఒకటే ..
మనిషిని మనిషిగా చూడటం … తను ప్రేమించినంత గొప్పగా జంతువుల్ని ,పక్షుల్ని ఇంకెవరు ప్రేమించరేమో ఈ ప్రపంచంలో … ఎంతోమందికి తను చేసిన ‘అపాత్ర దానాలు’ ఐతే వాటికి లెక్కే లేదు …ఒక నిర్ణయాన్ని తీసుకోడంలో అతని వేగాన్ని అందుకోడం అసాధ్యం … కానీ
ఒకే ఒక్క విషయంలో చాలా బలహీనుడు ..!
” మనిషిని అంచనా వేయడంలో “.
చాలా సార్లు మోసపోయాడు
ఈ “మనుషుల “వల్ల ….

నన్ను ఒక మాట అంటూ ఉంటాడు !
“ఎప్పుడూ అంత Happy గా ఎలా ఉంటావ్ రానువ్వు ?” అని ….😃

ప్రియమైన జగన్ …. ఈ 20 ఏళ్ల నీ ప్రయాణంలో నువ్వు -నేను మాత్రం అలానే ఉన్నాం … మనం ఎప్పటికి ఇలానే ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను ..విజయాన్ని అపజయాన్ని ఒకేలా చూడగలిగే దమ్మున్న హృదయం నీది 🤗
ఇంకోక్క 20 ఏళ్ళు సినిమాని ఇలాగే ప్రేమించరా …please 🙂
శుభాకాంక్షలు స్నేహితుడా ❤️

 

Related Post

చిరంజీవి పిలుపుతో నటుడు ఉత్తేజ్ రక్తదానం

Posted by - April 22, 2020 0
  ‘అన్నమాట బంగారుబాట’ అంటూ మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి అడుగు జాడలను అనుక్షణం ఆరాధనాపూర్వకంగా అనుసరించే నటుడు, కవి శ్రీ ఉత్తేజ్ ఇవాళ రక్తదానం చేశారు.…

మెగాస్టార్ పిలుపుతో రక్తదానం చేసిన జ్యోతి రెడ్డి

Posted by - April 26, 2020 0
కరోనా సంక్షోభంలో ఎందరో ఎన్నో సేవలు చేస్తున్నారు.ప్రతి ఒక్క సామాజిక వేత్త సమాజం పట్ల ప్రేమను చూపుతున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి అందరికి విభిన్నంగా లాక్ డౌన్…

కరోన మరక మంచిదేనా….చిన్న సినిమాలకు ఓటిటి ఫ్లాట్ ఫామ్ రూపంలో వరం

Posted by - April 26, 2020 0
మరక మంచిదే అన్నట్లు..కరోనా సంక్షోభం చిన్న సినిమాల పాలిట ఓటిటి వేదిక రూపంలో వరంగా మారింది.ఇపుడు కరోనా పెద్ద చిన్న సినిమా తేడా లేకుండా ప్రజాస్వామ్యన్నీ చక్కగా…

RGV పవర్ స్టార్ సినిమా రివ్యూ

ఎన్నో వివాదాల మధ్య ఈ రోజు విడుదల అయిన RGV పవర్ స్టార్ సినిమా రివ్యూ ని ప్రముఖ దర్శకుడు హృదయ కాలేయం,కొబ్బరిమట్ట సినిమాల సృష్టికర్త సాయి…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *