బీజేపీలో చేరిన ప్రముఖ ఎన్నారై వ్యాపారవేత్త రాధేష్ రెడ్డి..

1
172

తెలంగాణ బీజేపీలో కి చేరికలు ఊపందుకుంటున్నాయి .. లోక్ సభ ఫలితాల తర్వాత ఫుల్ జోష్ లో ఉన్న ఆ పార్టీ ఇతర పార్టీల నుంచి కీలక నాయకులను ఆకర్షిస్తుంది ..అలాగే తటస్థులను , వివిధ రంగాల ప్రముఖులను తమ వైపు తిప్పుకుంటుంది . ఇక నాయకులు, ప్రముఖ వ్యక్తులు కూడా మోడీ విధానాల పట్ల ఆకర్షితులవుతూ కాషాయ కండువా కప్పుకుంటున్నారు . ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఎన్నారై వ్యాపారవేత్త , నమస్తే హైదరాబాద్ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ గుర్రాల రాధేష్ రెడ్డి బీజేపీ లో చేరారు .. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవా లక్ష్మణ్ ఆధ్వర్యంలో గుర్రాల రాధేష్ రెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు .. తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ ట్రస్టీ గాను గతంలో పనిచేసిన రాధేష్ రెడ్డి పలు సేవ కార్యక్రమాలు చేశారు .. అయన చేరిక బీజేపీ కి లాభించే అవకాశం ఉంది . బీజేపీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న గుర్రాల రాధేష్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలపడటానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు .. తెలంగాణపై ప్రత్యేక ద్రుష్టి పెట్టిన షా .. పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు ..ఈ తరుణంలో గుర్రాల రాధేష్ రెడ్డి వంటి యువకులు , విద్యావంతులు పార్టీలో చేరడం ఆ పార్టీకి కలసి వచ్చే అవకాశం ఉంది .

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here