ప్రపంచానికి తెలియని మరో గోపీచంద్

0
580

ఒలింపిక్స్ వల్ల సింధు కి ఎంత పేరు వచ్చిందో దాదాపు అంతే పేరు తన కోచ్ గోపిచంద్ ,తన తల్లితండ్రులకు వచ్చింది . ఎందుకంటే పీవీ రమణ ,పీవీ విజయ లు స్వతహాగా క్రీడాకారులు కావటంతో సింధు గోల్ చిన్నతనంలోనే సెట్ చేసేసారు. ఇక గోపి చంద్ ఐతే సింధు ని నాల్గు ఏళ్లుగా సొంత కూతురులిలా చూసుకుంటూ సింధుని ఎంతో కష్టపెట్టి చివరికి తీపి జ్ఞాపకాలను సింధుకి అందించాడు. ఐతే తన మెడల్ గెల్చుకోవటానికి తల్లితండ్రులు ,గోపీచంద్ కుటుంబం ,తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం అని చెప్పింది.

ఐతే వీళ్ళందరూ కాకుండా ఒక వ్యక్తి కూడా మొదటి నుంచి తెలుగు షటిల్ ప్లేయర్స్ కి మంచి ప్రోత్సాహం ఇస్తున్నాడు. ఇక సింధు కి కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. నిజానికి అయన ఒక సినీ నిర్మాత కానీ ఆయనకున్న క్రీడల పట్ల ఆసక్తి ఆయన్ని ఒక బ్యాట్మెంటన్ లీగ్ లో ఒక జట్టుకు యజమానిని చేసింది. ఆయనెవేరో కాదు ఊపిరి ,వర్ణ ,సైజు జీరో ,కాష్మోరా లాంటి భారీ సినిమాల నిర్మాత పొట్లూరి ప్రసాద్ ఉరఫ్ పివిపి గారు. సింధుకి ,సైనాకి ,శ్రీకాంత్ కి ఎప్పటికప్పడు సలహాలు ఇచ్చేవాడు. బాడ్మింటన్ ప్లేయర్స్ కి నైతిక మద్దతు ఇస్తూ తన సహజసిద్ధమైన ప్రవర్తనని చాటాడు. ఇక సింధు విషయానికొస్తే సింధు మ్యాచులు ఒలింపిక్స్ లో జరిగేటప్పుడు అయన గోపిచంద్ అకాడమీలో ఒక సామాన్య ప్రేక్షకుడిగా ఎంజాయ్ చేసాడు. సింధు కి పాయింట్ వస్తే అందరితో కలిసి ఎగిరి గంతేశాడు. పాయింట్ పొతే సాటి ప్రేక్షకులను సముదాయించారు. పివిపి లాంటి క్రీడా అభిమాని నైతిక మద్దతు మూలానపడుతున్న మన భారతీయ క్రీడలు కూడా ఉంటె అవి ప్రాణంపోసుకుంటాయనేది సుస్పష్టం.క్రీడలను ప్రోత్సహించడానికి క్రీడల్లో ప్రావిణ్యం ఉండాల్సిన అవసరం లేదని మంచి మనసు ఉంటె చాలని పివిపి గారిని చూస్తే అర్థం అవుతుంది.

PVP-is-another-gopichand-for-shuttlers-1

PVP-is-another-gopichand-for-shuttlers-2

The Hyderabad Hotshots won the inaugural edition of the Indian Badminton league (IBL) 2013 played at Sardar Patel Stadium, Mumbai. Express photo by Vasant Prabhu. 031-08-2013, Mumbai

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here