భారత రత్న: పీవీ vs ఎన్టీఆర్?

0
1799

మన తెలుగు రాజకీయ చరిత్రను నెమరువేసుకున్న , నల్గురు నాయకుల గురుంచి ఎక్కువ ప్రస్తావన వస్తుంది . వాళ్ళల్లో పివి నరసింహ్మారావు ,చెన్నా రెడ్డి ,ఎన్టీఆర్ ,కేసీఆర్ ల పేర్లు బాగా వినబడతాయి. ఎందుకంటే ఈ నల్గురు తెలుగు రాజకీయ చరిత్రని సంసరించిన వాళ్ళు. వారిలో చెన్నారెడ్డి హయాంలో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి ,నక్సలైట్స్ సమస్యలు పరిష్కరించటం లాంటివి చాలా చేసాడు. కేసీఆర్ గురుంచి చెప్పాల్సిన అవసరం లేదు 60 ఏళ్ల తెలంగాణవాదుల కలను నెరవేర్చిన నాయకుడు. మరొక నాయకుడు ఎన్టీఆర్ ,పార్టీ పెట్టిన 8 నెలలకు అధికారంలోకి వఛ్చి 2 రూపాయలకే కిలో బియ్యం ,మధ్య నిషేధం లాంటి కార్యక్రమాలను సమర్తవంతంగా అమలు చేసి ప్రజలకు దగ్గరకి అయ్యాడు. ఇక మిగిలినది పీవీ. ఆపదలో ఉన్న దేశాన్ని తన మార్కు ఆర్థిక సంస్కరణలను ప్రారంభించి దేశ అభివృద్ధి కి ఊపిరినిఛ్చి ఇపుడు మనం అనుభవిస్తున్న సాఫ్ట్ వెర్ ఫలాలు ,గ్లోబలైజ్డ్ వాతావరణం ఆయన పుణ్యమే. ఒక విదంగా చెప్పాలంటే మనం తినే ప్రతి మెతుకు మీద ఆయన పేరు ఉంటుంది అని చెప్పటంలో సందేహం లేదు. పూర్తి మెజారిటీ ఉన్నా కూడా ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితిలో మైనార్టీ ప్రభుత్వాన్ని 5 ఏళ్లుగా నడిపి తన అపార చాణక్యాన్ని నిరూపించాడు. భారత దేశంలోని అధికార భాషలు వఛ్చిన ఏకైక నాయకుడు.

కానీ ఇప్పటి వరకు చాలా మందికి భారత రత్న లు వచ్చాయి కానీ ఈ గొప్ప నాయకుడికి మాత్రం ఇప్పించటంలో ఈ ప్రభుత్వం ప్రయత్నించలేదు. పాకిస్తాన్ కి చెందినా గఫార్ ఖాన్ ,సౌత్ ఆఫ్రికా ప్రజల మనిషి నెల్సన్ మండేలా కి దక్కిన ఈ పురస్కారం మనకు అన్నం పెట్టిన నాయకుడికి దక్కకపోవటం చాలా విచారకరం. ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వాలని తెదేపా వాళ్ళు ,వాళ్ళ సామాజిక వర్గాల వాళ్ళు ప్రతి సందర్బాల్లో డిమాండ్ చేస్తున్నారు కానీ వారికి పివి కి ఆ ఘనత దక్కాలని ఎవరు అడగటం లేదు. కానీ సోషల్ మీడియా లో మాత్రం తెలుగు రాష్ట్రంలో గల నెటిజన్లు ఎన్టీఆర్ కి కాకుండా పివి కి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరైతే వాళ్ళను కింది విదంగా పోల్చుతున్నారు.

  • పివి దేశం పాలించేటపుడు అన్ని రాష్ట్రాలను ఒకే విదంగా చూశాడని ఎన్టీఆర్ కేవలం ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే ఎక్కువ ప్రాముఖ్యత ఇఛ్చాడు.
  • పివి కి మైనార్టీ పార్లమెంట్ సభ్యులు ఉన్నా కూడా ప్రభుత్వాన్ని 5 ఏళ్లుగా గొప్పగా పాలించాడని ,ఎన్టీఆర్ కి మాత్రం రెండు సార్లు పూర్తి మెజారిటీ ఉన్న కూడా ఒకసారి నాదెండ్ల భాస్కర రావు తో మరోసారి తన అల్లుడైన చంద్ర బాబు తో భంగ పడి, పట్టు కోల్పోయాడు.
  • పివి ప్రధాని తన సామాజిక వర్గం అయినా బ్రాహ్మణులు ఎలా ఉన్నారో ఇప్పటికి అలాగే ఉన్నారని కానీ ఎన్టీఆర్ సీఎం అయ్యాక కమ్మలు చాలా అభివృద్ధి చెందారని ,దీంతో పీవీకి కుల పక్షపాతి కాదని అంటున్నారు.

ఇది ఏమైనా దేశాన్ని తన చాణక్యత తో ముందుకు నడిపించిన పివి కి కూడా భారత రత్న ఎన్టీఆర్ తో పాటు ఇవ్వాలని డిమాండ్ చేస్తే బాగుంటుందని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here