అర్గుల్ రాజారామ్ ని పివి పావులా వాడుకున్నాడా?

0
1441

1970 దశకంలో ఆంధ్ర కాంగ్రెస్ లో రెడ్ల ప్రాబల్యం ఎక్కువ ఉన్నప్పుడు బలహీన వర్గాల నాయకుడుగా నిజామాబాద్ జిల్లాకు చెందిన అర్గుల్ రాజారాం ఒక వెలుగు వెలిగాడు. హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు చెన్నారెడ్డికి ప్రతి విషయంలో కొరకరాని కొయ్యగా మారిపోయాడు. నిజామాబాదు జిల్లాలో ధర్మపురి శ్రీనివాస్ నుంచి శనిగరం సంతోష్ రెడ్డి వరకు నాయకులను తయారు చేసి నాయకుల ఫ్యాక్టరీగా మారిపోయి నిజామాబాదు జిల్లా చరిత్రలో తిరుగులేని లీడర్ గా ఎదిగాడు. ఐతే ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్న సమయంలో ఆకస్మికంగా మరణించాడు.

ఐతే చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించటానికి ఆయనకు వ్యతిరేకంగా ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ఉన్న పివి నరసింహ రావు పావులు కదిపేవాడని దానికి అనుగుణంగా ఆయనకు వ్యతిరేకంగా అన్నిట్లో సరితూగే అర్గుల్ రాజారామ్ ని ఉపయోగించుకొని చెన్నారెడ్డిని ముప్పుతిప్పలు పెట్టాడని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ రాజారాం చాల గొప్ప నాయకుడు అని,ఆయనకు కొన్ని స్వంత అభిప్రాయాలు ఉండేవని ,మరో నాయకుడు ప్రభావితం చేసే స్థాయి ఆయనది కాదని కొందరు వెటరన్ నాయకులూ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here