సాహో ప్రభాస్

0
291
    ఈశ్వర్ సినిమాతో తెలుగు సిని పరిశ్రమకి పరిచయం ఐన హీరో ప్రభాస్ ఇప్పుడు బాహుబలితో భారత దేశ సిని ఇండస్ట్రీకి సుపరిచితుడయ్యాడు. బాహుబలి సినిమా కోసం దాదాపు 5 సంవత్సరాలు ఇంకా వేరే సినిమా ప్రాజెక్ట్ లు ఒప్పుకోలేదు.. బాహుబలి తరువాత ప్రభాస్ మళ్ళి ‘సాహో’ అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.
    బాహుబలి తరువాత ప్రభాస్ ఎలాంటి సినిమా చేస్తాడు, సినిమా టైటిల్ హీరొయిన్ ఎవరు ? ఇలాంటి అనేక అంశాలపై అభిమానులో క్యూరియాసిటి పెరిగిపోయింది.
    ఈ నేపధ్యంలో ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమాకి ‘సాహో’ టైటిల్ ను పెడుతున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.
    యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నామని, ఈ సినిమాలో ప్రభాస్ స్టైలీష్ గా , ఎనార్జీటిక్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిపారు. చిత్రానికి వంశీ-ప్రమోద్ లు నిర్మాతలు కాగ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here