శ్రీమంతుడు పై సర్దార్ పంచులు

0
396
Mahesh Babu Srimanthudu ULTRA HD ALL Posters Wallpapers

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెంబర్ 1 పోటిదారుడు ,ప్రిన్స్ మహేష్ బాబు పైన పరోక్షంగా సెటైర్లు విసిరాడు. తన పని తానూ చేసుకుంటూ ఉండే పవన్ మామూలుగా ఇతరులపై కామెంట్స్ చేయడు . ఒక వేళా తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఊరుకోడు . మోహన్ బాబు తన అన్నయ్య ని విమర్శించినపుడు “తమ్ముడు మోహన్ బాబు ” అంటూ తనదైన శైలిలో విమర్శించాడు. అప్పటి వరకు సైలెంట్ గా ఉండే పవన్ ,మరొక కోణం చూసింది ప్రేక్షక ప్రపంచం. ఆ విడియో కి యుట్యూబ్ లో రికార్డు స్తాయిలో వ్యూస్ వచ్చాయంటే తెలుస్కోవచ్చు దాని క్రేజ్ ఏంటో ..

కాని పవన్ కళ్యాణ్ మంచి చమత్కరవంతుడు ,సైలెంట్ గానే ఉంటూ ఇతరులపైన పంచ్ లు వేస్తూ వెళ్ళుతుంటాడు. అయన మాటలు వినటానికి మాములుగా ఉన్న కూడా తర్వాత మెల్లిగా ఎక్కుతాయి. ఉదాహరణకి ఇటివల అనుపమ చోప్రా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చాల విషయాలు పంచుకున్నాడు. దానిలో ముఖ్యంగా
“మీరు బ్రాండ్ అంబాసిడర్ గా ఎందుకు ఉండటం లేదు ” అనే ప్రశ్నకి బదులిస్తూ వాడని వస్తువులకి ప్రమోట్ చేయటం అయన వలన కాదని , కాని బ్రాండ్ లను ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న తన సహా నటులను చూస్తె నాకు అసూయ కల్గుతుందని అన్నారు.
ఒకప్పుడు పెప్సీ బ్రాండ్ ని పవన్ ప్రమోట్ చేసే వాడు ,అది ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసి ఆపేసాడు ,కాని విచిత్రం ఏంటంటే చాల కాలం తర్వాత మహేష్ బాబు తంబ్స్ అప్ ని ప్రమోట్ చేస్తున్నాడు. మహేష్ ఆ బ్రాండ్ తీసుకున్నాక కూల్ డ్రింక్స్ లో పెస్టి సైడ్ కలుపుతున్నట్టు చాల వార్తలు వచ్చాయి కూడా,దానితో చాల మంది
సెలేబ్రేటి లు,విద్యావంతులు కూల్ డ్రింక్స్ ని తాగటం ఆపేశారు . అంటే మహేష్ కూడా కచ్చితంగా తాగాడు కాని ఆ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్నాడు. వ్యక్తిగత జీవీతంలో ప్రొఫెషన్ లో ఒకే విదంగా ఉండాలని ,ఇలాంటి వాటిని ప్రమోట్ చేస్తే అభిమానులకు తప్పుడు సందేశాలను పంపినట్లు అవుతుందని చెప్పకనే చెప్పాడు. వారిని చూస్తె అసూయ కల్గుతుందని చెప్పటంతో బ్రాండ్ల ద్వారా అత్యదికంగా సంపాదిస్తున్న మహేష్ ని ఉద్దేశించి చెప్పాడని ఫిలిం నగర్ లో చెవులు కొరుకుంటున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here