తప్పును ..తప్పు అని చెప్పలేమా ?


తప్పును తప్పు అని చెప్పలేని పరిస్థితినీ నేటి పాలకులు అమలు చేస్తున్నారు ..
రాజ్యం ప్రజలది ప్రజలు ఎన్నుకున్న వారు పాలకుడు అవుతాడు కానీ ఆ రాజ్యానికి ప్రజలే !ప్రభువులు ఈ ఇంగిత జ్గ్యానం లేకుండా !పాలకులు మేము ప్రభువులం అనుకోని నియంత పాలన చేస్తున్నారని ప్రజలు విమర్శలు చేయడం గమనార్హం .

అధికారం చేపట్టగానే విపక్ష పార్టీలు అధికారంలో చేపట్టిన అభివృద్ధి పనులను విధ్వంసాలు చేయడం ,ఆ నాయకులను వేధింపులు చేయడం నేటి పాలకుల హయాంలో ఎజెండాగా ?అమలు జరుగుతున్నాయి అని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి .
ఎవ్వరి పాలనా హయాంలో ఏ అభివృద్ధి పనులు చేసిన ప్రజా ధనంతో చేపట్టినవే !అలాంటి పనులు విధ్వసం చేయడం నేరం కదా ?
ప్రజాధనం తో చేపట్టిన పనులతో గత పాలకులకు మైలేజి ఉంటుందనో ..!ఆస్తులు కూలిస్తే వాటి నిర్మాణానికి అయిన నిధులను కూల్చివేతకు అనుమతి ఇచ్చినవారు ,అందులో భాగస్వాములైన అధికారులనుంచి “రికవరీ “చేయాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు .
ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్ గత సీఎం అఖిలేష్ యాదవ్ ఫోటో తో ఉన్న రేషన్ సరుకుల పంపిణి పథకం బ్యాగులను స్టాక్ ఉన్నత వరకు వాడాల్సింది అధికారులను ఆదేశించారు .
ఈ సందర్భంగాఆయనను ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చిందంటే !ప్రజా ధనం సద్వినియోగం చేయడంపట్ల ఉన్న చిత్తశుద్దిని .

నిజాలను ప్రశ్నిస్తే కేసులు ..ఎదురిస్తే దాడులు చేయడం నేటి పాలకులు లక్ష్యంగా పెట్టుకోవడం సహించరానిదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .
నేడు పాలకులు మా పాలనా ఏదేళ్లు అన్న విషయాన్ని తుంగలో తొక్కి శాశ్వత పాలక ప్రభువులం అనుకుంటున్నారు .ఇందుకు బ్యూరోక్రాట్స్ రాజ్యాంగ మూలలను పాటించకుండా !పాలకులకు “జీ “హుజూర్ అనడం న్యాయసమ్మతంగా లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
ప్రధాన ప్రతిపక్షం ఉండేలా !పార్టీ ఫిరాయింపుల చట్టం కఠినతరం కావాలి ఈ లాంటి వ్యవస్థ అమలు జరిగినప్పుడే !ప్రజాస్వామ్యం బతికి బట్ట కడుతుందని ప్రజలు సూచిస్తున్నారు .
ప్రభుత్వ ఉద్యోగి ఐదేళ్ల కాలంలో రెండు పర్యాలు బదిలీ చేస్తారు ఎందుకంటే ?ఒకే ప్రాంతంలో ఉంటే పరిచయాలు పెరిగి అవితికి తలుపులు బార్ల తెరుచుకుంటారని .
ఈ సూత్రం పాలకులకుడా ప్రజలు వర్తింప చేయాలి మేధావి వర్గాలు హితవు చెబుతున్నాయి .
పాలకులు ప్రతిపక్షం లేకుండా పాలనా సాగించే విధానం వల్ల ఉత్పాదక రంగాలు కుదేలై ! సబ్సిడీలు ,జనాకర్షణ చెల్లింపులు చేయడం వల్ల ప్రజలు ఆర్థికంగా బలపడలేకపోతున్నారు .
ప్రజలకు పాలకులు భరోసా నిచ్చే పథకాలు రూపకల్పన చేసి చేయూతనివ్వాలి .
మీ ….
సకినాల సుధాకర్
సీనియర్ జర్నలిస్టు

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close