రాజకీయ శత్రువులు ఒకటౌవుతున్నారా?

0
775

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని మరోసారి నిరూపితం అయ్యింది. గత ఎన్నికల్లో ఒకరి పైన కారాలు మిరియాలు ,సెటైర్లు వెటకారాలు వేసుకున్న జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ,నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవితలు ఇపుడు ఒక ఇష్యూ మీద ఒకటైయ్యారు. అమరావతిలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో నిజామాబాద్ ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు విడిపోయినా తెలుగు ప్రజలంతా ఒక్కటేని ప్రత్యేకహోదా సాధనకు తాము కూడా మద్దతునిస్తామని చెప్పారు. ఈ కామెంట్ కి కృతజ్ఞతగా పవన్ కళ్యాణ్ ఒక ట్విట్ పెట్టి ఇరువురు అభిమానుల్లో జోష్ నింపాడు.

హోదాకు మద్దతు తెలిపిన కవితకు ధన్యవాదాలు తెలిపారు. కలిసి పనిచేస్తే ఇరు రాష్ర్టాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. రెండు రాష్ర్టాలకు ప్రత్యేక హోదా అవసరమేనన్నారు. కలిసి ఉంటే నిలబడతాం.. విడిపోతే పడిపోతామని పేర్కొన్నారు. ఈ మేరకు అమెరికాలో పర్యటిస్తున్న పవన్ ప్రత్యేక ట్వీట్ చేశారు. ఈ ఒక ట్విట్ తో అటు అభిమానుల్లో ఇటు రాజకీయ విశ్లేషకులను షాక్ కి గురి చేశాయి. కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరికీ కామన్ శత్రువు టిడిపి -బిజెపి కనుక రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పనిచేయొచ్చనే వాదన వినిపిస్తుంది. ఈ మధ్య మెగా -కల్వకుంట్ల కుటుంబాల సాన్నిహిత్యం కూడా ఈ వార్తలకు ఉప్పందిస్తుంది. చూద్దాం రాజకీయ చదరంగంలో ఏమైనా జరోగొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here