రెడ్ బస్సు అధినేత కి తెలంగాణ ప్రభుత్వం అరుదైన భాద్యతలు

0
372

తెలంగాణ బిడ్డ, నిజామాబాదు వాసి, రెడ్‌ బస్‌ కో ఫౌండర్‌ సామ ఫణీంద్రకు తెలంగాణ ప్రభుత్వం విశేష గౌరవం కల్పించింది. రాష్ట్ర చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌గా సామ ఫణీంద్రను నియమిస్తున్నట్లు, ఈరోజు సచివాలయంలో మంత్రి కేటీఆర్‌ను నియామక పత్రం అందించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ ఇన్నోవేషన్‌ సెల్‌ కి రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఫణింద్రకు బాధ్యతలను అందించారు. స్టార్ట్ అప్ కంపెనీలను ఒకే దగ్గర కేంద్రీకృతం చేసినేందుకు ప్రభుత్వం తరపున ఈ సెల్ పనిచేస్తుంది. ఇది ఒక హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంక్యుబేటర్ల కేంద్రాలను ఇంటిగ్రేట్ చేస్తుంది.

దేశంలో ఎంతో మందికి ఆదర్శమైన ఫణింద్ర ప్రస్తుతం సామఫణీంద్ర క్షేత్రస్థాయిలోని సమస్యలకు పరిష్కారాలు చూపే కాకతీయ శాండ్‌ బాక్స్‌ అనే ప్రయోగాత్మక ల్యాబ్‌కు పోషకుడు (పాట్రన్‌)గా వ్యవహరిస్తున్నారు.భవిష్యత్తులో తెలంగాణ నుంచి ఎంతో మంది ఎంట్రప్రెనర్లను తయారుచేయడంలో సఫలీకృతం అవుతాడని ఆశిద్దాం. ఫణింద్ర గురించి మన తెలంగాణ కబుర్లు లో మొదటి తెలంగాణపీడియా వ్యాసం రాయబడింది . దాని కోసం కింద లింక్ పైన క్లిక్ చేయండి .

తెలంగాణా పీడియా : RedBus ఫణి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here