ఈ పెళ్లి చూపులను తప్పకుండా చూడాలి

0
1141

రుద్రమదేవి సినిమా వచ్చినాక తెలంగాణ యాసతో కమర్షియల్ హిట్ కొట్టొచ్చని నిరూపించాడు గుణశేఖర్.
తెలంగాణ యాసలో ఎంతో దమ్మున్న కూడా ఆ యాసలో ఒక సినిమా వస్తుందంటే చాలా మంది  చూపరు ఎందుకంటే సరిఅయిన స్క్రిప్ట్ లేకపోవటం ,నిర్మాణ విలువలు కూడా మిస్ కావటం. కానీ సురేష్ ప్రొడక్షన్స్ వంటి దిగ్గజ సంస్థ నుంచి ఒక ఫుల్ తెలంగాణ యాసలో వస్తున్న పెళ్లిచూపులు సినిమా ఎలా ఉందొ సమీక్షలో చూద్దాం పదండి.

కథ:

పక్కాగా చెప్పాలంటే ఇష్టం లేకున్నా బి టెక్ ని చదివి కస్టపడి డిగ్రీ తెచ్చుకునే యువకుడు ప్రశాంత్ (విజయ్ ).ఎప్పటికైనా మంచి షేప్ కావాలన్నదే ఆ కుర్రాడి కల. తన కొడుకు లైఫ్ లో ఎలాగైనా సెట్ చేయాలనే ఆలోచనతో మంచి కట్నం ఇచ్చే అమ్మాయితో పెళ్లి చేయాలనుకుంటారు. ఈ క్రమంలో పెళ్లి అంటే ఇష్టం లేని చిత్ర (రితు వర్మ) తన కెరీర్ లో బాగా సెటిల్ అవ్వాలనుకునే యువతీ.
తండ్రి బలవంతం మీద తన ఆశల్ని చంపుకుని బలవంతంగా పెళ్లిచూపులకు తయారవుతుంది చిత్ర.
అప్పుడు పెళ్లి చూపుల్లో కలిసిన ఈ జంట ఒకరి అభిప్రాయాలు పంచుకుంటారు. ఈ సంఘటన వాళ్లిద్దరి జీవితాల్ని ఏ మలుపు తిప్పిందన్నది కథ.

కథనం

ఒక విదంగా చెప్పాలంటే కథ మాములుగా అనిపించినా కూడా కథనం సినిమాకు బలం అని చెప్పాలి. దశాబ్దం క్రీతం శేఖర్ కమ్ముల అనే వ్యక్తి ఇండస్ట్రీకి వచ్చి కథనానికి ఒక ఫార్ములా లేకుండా కథ ని నడిపిస్తూ ఆనంద్ అనే సినిమా వచ్చింది. నిజానికి ఆ సినిమా వచ్చినపుడు అందరు రెండు విధాలుగా ఆశర్యపోయారు ఒకటి ఏంటంటే అప్పటివరకు కామెడీ లేదా ఫ్యాక్షన్ లేదా రొటీన్ లవ్ కథలు వస్తున్నా యెడల ఫార్ములా ని బ్రేక్ సినిమా తీయటం,రెండవది ఏంటంటే అలాంటి సినిమాను మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా MBBS సినిమా’విడుదల’చేసిన రోజు విడుదల చేయటం. ఎందుకంటే ఆ రోజుల్లో చిరంజీవి సినిమా వస్తుందంటే ఆ నెలలోనే చిన్న సినిమాలు విడుదల అయ్యేవి కావు. కానీ వీటిని కమ్ముల బ్రేక్ చేసి కొత్త ఒరవడి సృష్టించాడు.
మలుపులు లేకుండా చక్కని సంగీతం ,పంచ్లు లేకుండా అలా సాగుతుంది. ప్రతి పాత్రని వేస్ట్ చేయకుండా రచయిత దర్శకుడు తరుణ్ భాస్కర్ బాగా రాసుకున్నాడు ,అదే విదంగా తెరకెక్కించాడు. ముక్యంగా కామెడీ సూపర్ గా ఉంటుంది. అతి ప్రధానంగా సినిమాలో పాత్రలు తెలంగాణ యాసలో మాటలాడుతాయి.ఈ విదంగా తెలంగాణ యాసను ఒక కమర్షియల్ పంథాలో బాగా తెరకెక్కించాడు దర్శకుడు.

ఎవరు ఎలా చేసారు ?

తొలి సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’లోనే తానేంటో రుజువు చేసుకున్న విజయ్ దేవరకొండ.దీనిలో ఇరగదీసాడు
హీరోయిన్ రితు వర్మ కూడా చాలా బాగా చేసింది.
హైదరాబాదీ తెలంగాణ యాసలో ఇరగదీసిన ప్రియదర్శి దీనిలో స్పెషల్ అట్రాక్షన్.
వివేక్ సాగర్ సంగీతం చాల బాగుంది .పాటలు ,నేపథ్య సంగీతం బాగున్నాయి
నగేష్ బెగెల్లా అందించిన సినిమాటోగ్రఫి బాగుంది
సురేష్ ప్రొడక్షన్ లో వచ్చిన సినిమా కాబట్టి నిర్మాణ విలువల గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ సినిమాలో ఎక్కువ చర్చికునేది మాత్రం దర్శకుడు దాస్యం తరుణ్ వినయ్ భాస్కర్. కొత్త దర్శకుడు అనే ఫీలింగ్ ఒక్క సీన్లో ,ఒక్క షాట్ లో కనిపించదు. పాత్రల డిజైన్ ,వాటి చిత్రీకరణ సూపర్బ్ . ప్రధానంగా తరుణ్ చేసిన ఓక్ ప్రయోగం హైదరాబాద్ యాస. ఇప్పటి డెక్కన్ హిందీ లో వచ్చిన అంగ్రేజ్ సినిమా సక్సెస్ అయినా తర్వాత అంతగా హిట్ కాలేదు . కానీ తెలుగు తెలంగాణ యాసలో సినిమా అవుట్ అవుట్ కమర్షియల్ సినిమా రాలేదు . ఆ ఛాలెంజ్ ని తీసుకొని భవిష్యత్తులో తెలంగాణ యాసలో కూడా మంచి స్క్రిప్ట్ తో వస్తే హిట్ కొట్టొచ్చు అని రుజువు చేసి సమాంతర తెలంగాణ ప్రాంతీయ సినిమాకు పోశాడు. కుటుంబం మొత్తం కలిసి ఈ పెళ్లిచూపులను చూసిఎంజాయ్ చేయొచ్చు.

 

Verdict: ఈ పెళ్లి చూపులను తప్పకుండా చూడాలి

Rating:3.75/5

Author: Raja shekar ryada

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here