ఒక్క మీటింగ్ తో రాజకీయాలను మార్చేసిన పవన్

0
643

ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్టాలు అయ్యాకా చాల మంది తెలంగాణ కి ఎక్కువ కష్టాలు ఉంటాయని అనుకుంటున్నారు ఎందుకంటే అప్పటివరకు బడా బడా వ్యాపారవేత్తలు ఆంధ్ర వాళ్ళు ఉండటం ,దేశంలోనే మంచి లాబీయింగ్ చేసే వాళ్ళు ఆంధ్రాలో ఉండటం ,విద్యావేత్తలు అక్కడే ఉండటం ,దానితో పాటు మంచి అడ్మినిస్ట్రేటర్ గా పేరుగాంచిన చంద్ర బాబు సీఎం అవ్వటం కారణాలు. వీటన్నిటికీ తోడు స్పెషల్ స్టేటస్ ఆంధ్ర ప్రదేశ్ కి ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వటం అతి పెద్ద కారణాలు. కానీ అందరి అంచనాలను కెసిఆర్ ప్రభుత్వం తలకిందులుగా చేసింది. ముఖ్యంగా ఆంధ్రాకి షిఫ్ట్ అవుతుందని అనుకున్న సాఫ్ట్ వెర్ రంగంలో ఐతే హైదరాబాద్ లో స్థిరబడి షాక్ ఇచ్చింది.
ఇక స్పెషల్ స్టేటస్ గురుంచి కేంద్రాన్ని బాబు తన వోట్ కి నోట్ కేసు వలన నిలదీయలేని పరిస్థితి. దానికి తోడు బీజేపీ మిత్రపక్షం. ఇక జగన్ సంగతికొస్తే ఎప్పుడు చూసిన బిజెపి-టిడిపి ల మధ్య ఉన్న సంబంధాన్ని చెడికొట్టి బిజెపితో దోస్తీ చేయాలనీ చూస్తుంది తప్ప సీరియస్ గా ప్రయత్నం చేయలేదు. ఇలా అటుకెక్కిన స్పెషల్ స్టేటస్ గురుంచి ఆంధ్ర ప్రజలు దాదాపు మర్చిపోయారు. ఇలాంటి సమయంలో జనసేన అధ్యక్షుడు,పవన్ కళ్యాణ్ తిరుపతి ఒక మీటింగ్ పెట్టి అందరిని ఉతికి పారేశాడు. స్పెషల్ స్టేటస్ గురుంచి బిజిపిపైన తీవ్రంగా విరుచుకుపడిన కూడా రెండు రోజుల వరకు ఆ ఎఫెక్ట్ కనపడలేదు. కానీ ఇపుడు ప్రతి టిడిపి ,బీజేపీ మరి వైకాపా నాయకుల స్టేట్మెంట్స్ చూస్తుంటే పవన్ కి బయబడుతున్నట్లు కనిపిస్తుంది. ముక్యంగా టిజి వెంకటేష్ లాంటి వాళ్ళు పవన్ ని లాజిక్ లేకుండా విమర్శించటం చూస్తుంటే టిడిపి అబద్రతాభావాన్ని తలపిస్తుంది. ఎక్కడ కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇస్తుందో దాని పవన్ ఎక్కడ క్రెడిట్ కొట్టేస్తాడో అని వాళ్ళ భయం కొట్టేసినట్లు కనిపిస్తుంది. దానికి తోడు అయనపై కొన్ని పత్రికలూ చేసిన కుల ముద్ర రాతలను అయన కౌంటర్ ఇవ్వటం చూసి సదరు పేపర్ వాళ్లకు ఎక్కడ తాకాలో అక్కడ బాగా తాకిందట. వెంకయ్య నాయుడు ని ,సిపిఎం నారాయణలను కూడావదలలేదు. రెండు రోజులుగా టీడీపీ కేంద్రంలో హడావిడి రాజకీయాలు అందరిని విస్మయం చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న అమిత్ షా ఆంధ్రకి స్పెషల్ స్టేటస్ ఇస్తాడని వస్తున్నా వార్తలు గుప్పుమనడం, పవన్ కళ్యాణ్ రాజకీయాలను తన వైపు తిప్పుకున్నాడని అందరు అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here