ప్రభుత్వానికి పుష్కర స్నానం చేయించిన పవన్

0
519

ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో పవన్ తెదేపా ప్రభుత్వం పైన తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో స్థాపించనున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ కంపెనీకి వ్యతిరేకంగా గత కొద్దీ రోజులుగా అక్కడి రైతులు,మత్స్యకారులు చాల ఆందోళలను చేస్తున్న విషయం తెలిసిందే. ఆ ఫ్యాక్టరీ వల్ల గోదావరి నది కలుషితం అయ్యే ప్రమాదం ఉండే అవకాశం ఉంటటం వలన వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారు. వాళ్ళ ఆందోళనలకు ప్రభుత్వం దిగిరాకపోయేసరికి బాధితులు పవన్ కళ్యాణ్ ని కలిసి బాధను చెప్పారు. కాకినాడ సభ నిర్వహించిన తర్వాత తాజాగా హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఘాటు హెచ్చరికలు చేశారు. పశ్చిమబెంగాల్ లో సర్కారుకు వ్యతిరేకంగా వామపక్షాలు సాగించిన పోరాటంతో రక్తపాతం పారిన నందిగ్రామ్ ఉదంతాన్ని ప్రస్తావించి పవన్ బీమవరం లోనూ అదే సీన్ రిపీట్ అవుతుందని హెచ్చరించారు. అంతేకాకుండా ఏపీ సర్కారు తీరును తప్పుపట్టారు. తన పార్టీ నిర్మాణం కొనసాగుతున్న తీరును సైతం పవన్ ఈ సందర్భంగా వివరించారు. ఎంతో ఖర్చు పెట్టిప్రభుత్వం గోదావరి ,కృష్ణ పుష్కరాలను నిర్వహించిందని,కానీ నదులు కలుషితం అయ్యే పరిస్థితులను ఎందుకు తీసుకువస్తుందో ప్రభుత్వానికే తెలియాలని అన్నాడు. ఒక వైపు ప్రధాని గంగ ప్రక్షాళన గురుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే ఎన్డీఏ మిత్రపక్షమైన తెదేపా ప్రభుత్వం వారికి భిన్నంగా వ్యవహరించటం అశ్యరంగా ఉందని తనదైన శైలిలో చురకలు అంటించాడు పవన్. అయన చేసిన వ్యాఖ్యలకు ఇరు రాష్ట్రాల ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here