అభిమానుల్లో పవన్ అభిమానులు వేరయా:కౌలు రైతులను ఆదుకున్న సాఫ్ట్ వెర్ ఉద్యోగులు

0
660

పవన్ కళ్యాణ్ కి ఎక్కువ అభిమానులు ఎందుకు ఎక్కువగా ఉంటారంటే అయన సింప్లిసిటీ ,ప్రవర్తన. నిజానికి పవన్ కి హంగు హార్భాటాలు అంటే ఇష్టముండవు.సెలబ్రిటీ హోదా ఉన్నా కూడా వ్యవసాయం చేస్తూ ఉంటాడు. చివరికి అయన పుట్టినరోజున కూడా కేక్ కట్ చేసిన సందర్భాలు కనబడవు.అలాంటి హంగుల బదులు సమాజసేవ చేస్తే బాగుంటుందని భావించే వ్యక్తి. ఇపుడు అయన అభిమానులు అయన పుట్టినరోజును అందరిలాగా కాకుండా తమ అభిమాన నటుడికి ఇష్టమయ్యే విదంగా జరపడటం జరిగింది. తమ నాయకుడి ఇష్టమైన ప్రవ్రుత్తి వ్యవసాయంలో నష్టపోతున్న కౌలు రైతులకు సహాయం చేసి పవన్ అభిమానుల్లో వీళ్ళు డిఫరెంట్ గురు అనిపించుకునే విదంగా అనిపించి అందరి మన్ననలు పొందారు ఈ సాఫ్ట్ వెర్ అభిమానులు.

వివరాల్లోకి వెళితే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని పవన్ కళ్యాన్ గారి IT అభిమానులు,Save Global farmers foundation ఆధ్వర్యంలో కౌలు రైతులు అయిన దుందిగల్ ప్రాంతంలోని కుమ్మరి చంద్రయ్య,దూసగంటి రాజు,నాయకంటి దమ్మయ్య లకు 10000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో Save Global farmers foundation అద్యక్షుడు రవిందర్ ర్యాడ,పవన్ కళ్యాణ్ IT అభిమానులు రఘు రాం,ప్రవీణ్ ఆనుగంటి ,కిరణ్,నరేష్ వీసం,తెలంగాణ క్రికెట్ అకాడమీ అధ్యక్షుడు లవన్ కుమార్,Save Global farmers కర్ణాటక ఇంచార్జీ రునిల్ బార్ల,ఉపాధ్యక్షుడు శ్రవణ్ ఆర్మూర్ ,బొరంపేట్ ప్రశాంత్ మరియు షామిర్పెట్ రాజేష్ పాల్గొన్నారు…దాతలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి హంగు హర్బటలు ఇష్టం ఉండకపోవటం,వ్యవసాయం అంటే మక్కువ ఉండటం వల్ల ఆయన అభిమానులుగా ఆయన బాటను నడుస్తూ వ్యవసాయంలో ఎన్నో కష్టాలు ఎదుర్కుంటున్న కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేయాలని అందరం నిర్ణహించుకున్నామని తెలియచేశారు.భవిష్యత్తులో రైతులకు సహాయం చేస్తామని తెలియచేశారు..

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here