విమర్శకులకు అందని ఎత్తులో పవన్ కళ్యాణ్ ప్రసంగం

0
1351

సమకాలిన రాజకీయాల్లో విమర్శలు అంటే సర్వదా మాములే. 1970 వ దశకం వరకు రాజకీయ విమర్శలు చాల సున్నితంగా, విధాన పరంగా ఉండేవి. కానీ 1983 తరువాత విమర్శలకు అర్థం మారిపోయింది. విమర్శల పరిధి దాటి ఇంట్లోకి వెళ్లి ఆ తర్వాత బెడ్ రూంలోకి వాష్ రూంలోకి విస్తరించి వ్యక్తిగత విమర్శలు ఎక్కువ అయిపోయాయి. ఇక 2009 లో ఎక్కుపెట్టిన విమర్శలు దాదాపు గుడ్డలు వెప్పేసే స్థాయికి దిగజారాయి. ఎవరైనా కౌంటర్ వేస్తె చాలు దానికి రే కౌంటర్ క్షణాల్లో రెడీ చేసే సమర్ధులు ఎక్కువ అయిపోయారు.

ఇక ఈ మధ్య ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల ముఖ చిత్రాన్ని మారుస్తూ జరుగుతున్న జనసేన సభల ప్రసంగాల తర్వాత వ్యతిరేఖ పార్టీలు విరుచుకుపడి లోపాలను బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఒక వేళా లోపాలు లేకున్నా కూడా వాటిపై ఎదో ఒక విదంగా లోపంలాగా చూపాలని చూసారు. ఉదాహరణకు స్పెషల్ ప్యాకేజిని పాచిన లడ్డులతో పవన్ పోల్చితే దానికి కౌంటర్ గా ఆ లడ్డులను తిరుపతి లడ్డులుగా పోల్చుతూ తిరుపతి లడ్డులు ఎప్పుడు పాచిపోవని అయన స్టైల్ లో చెప్పాడు.నిజానికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పిన వెంకయ్య అది వీలు కాదని తెలిసి స్పెషల్ ప్యాకెజీ అమృత మంత్రం అని చెప్పటం సరియన విషయం కాదు. కానీ దాన్ని దాచిపెట్టడానికి ప్రతి విమర్శ చేసాడు.

కానీ నిన్న జరిగిన అనంతపురం బహిరంగ సభలో అయన చేసిన ప్రసంగంలో చాల స్పష్టంగా ఆయనకు శత్రువులు ఎవరు లేరని , ప్రజలకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళే ఆయనకు శత్రువులు అని తేల్చిచెప్పారు. రాజధాని అంటే ఎత్తైన మేడలు కాదన్నాపవన్ ,సింగపూర్ ని ఆదర్శంగా తీసుకోవాల్సింది అవినీతి నిర్మూలన పైన అని, వెడల్పైన దారులు కావని కుండబద్దలు కొట్టారు. లీక్ వాన్ యూ సింగపూర్ ని 25 సంవత్సరాలు పాలించారు.. తన సొంత స్నేహితుడు కరప్షన్ చేస్తే లీక్ వాన్ యూ జైళ్లో పెట్టించాడు అని పరోక్షంగా చంద్రబాబు పైన అయన సామాజికవర్గంపైన ధ్వజమెత్తాడు.

ప్రత్యేక ప్యాకేజీ విషయంలో జైట్లీ వెంకయ్య మాటలకూ పొంతన లేదని తేల్చి చెప్పాడు. ఇలా పవన్ మాట్లాడిన ప్రతి మాటలో ప్రభుత్వాలను విమర్శించి అటు ప్రతి పక్షం ఇటు ప్రభుత్వం ఎలాంటి ప్రతి విమర్శ చేయకుండా వార్ ని వన్ సైడ్ చేసాడు. వాళ్ళ మౌనానికి అర్థం ఏంటో కాలమే సమాధానం చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here