గద్వాల్ కోసం పాదయాత్ర

0
746

ఇపుడు మాజీ మహిళా మంత్రి డికె అరుణ ఇప్పుడు తన ఉనికిని చాటుకునేందుకు ఒక కొత్త నినాదంతో తన ఉనికిని చాటుకోవడానికి సిద్ధం అయ్యారు. దానికి కోసం పాదయాత్ర ప్రారంభించారు. మహుబూబ్ నగర్ లో గల గద్వాలను జిల్లాగా మార్చాలని ఆమె డిమాండ్‌ చేస్తున్నారు. దీనావస్థలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కి కొంతమంది నేతలు కాంగ్రెస్‌కు జవసత్వాలు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నారు మాజీమంత్రి డికే అరుణ. నిజానికి జిల్లాల విభజన అంశం తెరమీదికి రాగానే గద్వాలకు కూడా ప్రత్యేక డిస్ట్రిక్ట్‌ కావాలన్న నినాదం వినిపించింది. కొన్ని నిరసనలు కూడా జరిగాయి. కొత్త జిల్లాల్లో గద్వాల్‌ పేరు కూడా ఉంటుందని అనుకున్నారు. అయితే ఇప్పటికే కొత్త జిల్లాల తుదిజాబితా సిద్ధం కావడం, అందులో గద్వాల్‌ ప్రస్థావన కూడా రాకపోవడం విశేషం. దీంతో ఆ ప్రాంత ప్రజలు కాస్త అసంతృప్తికి లోనై ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఇదే డిమాండ్‌తో ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు డికే అరుణ. ఇటిక్యాల, గద్వాల, మానవపాడు, ప్రాంతాల్లోని దాదాపు 30 గ్రామాల్లో ఈ పాదయాత్రలో పర్యటించనున్నారు. కాంగ్రెస్‌ వాయిస్‌ బలపడేందుకు మాత్రమే ఈ యాత్ర పనికొస్తుందా లేదా గద్వాల జిల్లా ఏర్పాటుకు ఏమైనా ఉపకరిస్తుందా అనేది వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here