బొండా బుగ్గ కారుకి బొక్క పెట్టిన ఆరంజ్ బస్సు?

0
2263

ఈ రోజు ఏ టివి ఛానల్ చూసిన ,ఏ యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసినా,ఏ వెబ్ సైట్ చూసిన కూడా ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణ ,కొత్త మంత్రుల ప్రమాణాలు ,సంతోషాలు .. మంత్రి పదవి ఆశించి దక్కని వాళ్ళ అహకారాలు దర్శనమిచ్చి తెలుగు ట్రేండింగ్ లా నిలిచాయి. ప్రధానంగా వైస్సార్ పార్టీ నుంచి వచ్చిన జలీల్ ఖాన్ మీద బాగా జోక్స్ పడితే ,బోండా ఉమా మీద మాత్రం కొంచెం సానుభూతి పవనాలు వీస్తున్నాయి. ఎందుకంటే పేరు మొదటిసారి ఎమ్మెల్యే అయిన కూడా అమరావతిలో అన్ని తానై చంద్ర బాబు కి చేదోడు వాదోడుగా నిలిచాడు. దాదాపు అన్ని ఇష్యూల్లో బాబుకి వకాల్తా పుచ్చుకొని బాబు కి అండగా నిలిచాడు. కాపు కార్డు మీద ఈ సారి ఆయనకు మంత్రి పదవి వస్తుందని బోండాతో పాటు ,ఆంధ్ర ప్రజలు కూడా ఊహించారు. కాని ఉమకి మాత్రం మంత్రి పదవి మాత్రం దక్కలేదు. ఐతే ఈ విషయాన్నీ బాబుని నిలదీసినట్లు సమాచారం ఐతే బాబు వివరణ విని షాక్ తిన్నాడట బోండా ఉమ. ఆయనకు ఎందుకు మంత్రి పదవి ఎందుకు రాలేదో బాబు చెప్పిన కారణం వింటే అందరు షాక్ తింటారు. అదేంటో చూడండి…

వారం క్రీతం తెలుగు ప్రజలను ,మీడియాను కుమ్మేసిన ఇష్యూ ఆరంజ్ ట్రావెల్స్ వెర్సెస్ కేశినేని ట్రావెల్స్. ఆరంజ్ ట్రావెల్స్ ని ఇరికిద్దామని ప్రయత్నించిన కేశినేని నాని కి చుక్కెదురైంది.కాని ఈ వివాదంలో ప్రత్యక్షంగా ఉన్న కేశినేని మరియు ఆరంజ్ ట్రావెల్స్ వాళ్లకు పోయిందేమి లేదు ఎందుకంటే కేశినేని అయన బస్సులను యధావిధిగా నడుస్తున్నాయి ,ఆరంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి ఇరు రాష్ట్రాల్లో సానుభూతి పెరిగి ఒక్కసారిగా ఆయన్ని హీరో చేసింది ఈ వివాదం. కాని ఈ విషయంలో విజయవాడ ఆర్టీఓ కమిషనర్ తో గొడవ బోండా గొడవ పడటం వలన అయన మంత్రి పదవికి గండి పడింది. నిజానికి కేశినేని తరపున వచ్చిన బోండా కి ఒక సమయంలో కమిషనర్ కి బోండా కి అసలు గొడవ అన్నట్లు కనిపించింది. సరిగ్గా బాబు కూడా ఈ కారణం చెప్పి బోండాకి బుగ్గ కారుని దూరం చేశాడట.కాని ఈ కారణంతో మంత్రి పదవి రాకపోవటం పైన బోండా భరించలేకపోతున్నాడని సమాచారం.

ఒకవేళ ఈ వార్త నిజమైతే బోండా ఉమా ఆటలో అరటి పండు అయినట్లే

Author:Ravinder Ryada

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here