మల్టీ స్టార్ చిత్రాలకు మరో ఊపిరి

0
505

2010 లో శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్ లో పవన్ కళ్యాణ్ ,వెంకటేష్ లతో మల్టీ స్టార్ చిత్రాన్ని తీస్తున్నట్లు ఒక ప్రకటన చేసాడు. ఆ స్పూర్తితో , క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ,మంచు మనోజ్ లతో వేదం అనే సినిమాని ప్రకటించి సీతమ్మ కన్నా ముందే విడుదల చేసాడు. కాని ఈ క్రమంలో సీతమ్మ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ తప్పుకోగా మహేష్ బాబు వచ్చాడు. 30 ఏళ్ల తర్వాత వచ్చిన అతిపెద్ద మల్టీ స్టార్ గా విడుదలైన ఈ సినిమా విజయవంతం కావటం వలన ఇంకా చాల సినిమాలకు ఊతం ఇచ్చింది. దీని తర్వాత ఎవడు, గోపాల గోపాల రావటంతో తెలుగులో మల్టీ స్టార్ సినిమాలు రావటం అనేది పెద్ద అశ్యర్యకరమైన విషయం ,బ్రేకింగ్ న్యూస్ కాకుండా పోయింది. ఐతే ఎవడు సినిమా విజయం తర్వాత దర్శకుడు వంశీ మరో మల్టీ స్టారర్ తీయాలనే ఉద్దేశ్యంతో ద ఇంటచబుల్స్ అనే ఫ్రెంచ్ సినిమాను ఎన్నుకున్నాడు . ఈ సారి ఎన్టీఆర్ జూనియర్ ,నాగార్జున లను ఎన్నుకున్నాడు. కాని ఎన్టీఆర్ కి డేట్స్ ప్రాబ్లం రావటం తో తమిళ్ స్టార్ కార్తి ని తీసుకొని ద్వి బాష చిత్రంగా మార్చాడు. ఫ్రెంచ్ మూవీ అంటే కాన్సెప్ట్ సినిమాలు ,తెలుగు అంటే పక్కా కమర్షియల్ సినిమాలు ,ఒక వైపు మన్మదుదు ,మరో వైపు అవారా అంటూ వినోదం పంచె నటుడు. మరి ఈ నటులను ఎలా బాలన్స్ చేసాడు ,ఆ ఫ్రెంచ్ బాషలోని కంటెంట్ ని తెలుగు వాళ్ళకి ఎలా కన్విన్సు చేసే ప్రయోగం ఫలించిందా లేదా ఒక సరి సమీక్షలో చూద్దాం పదండి.

కథ

ప్రపంచంలో డబ్బు ఉంటే చాలు ఎలాగైనా బతికేయొచ్చు అనుకునే శీను (కార్తీ) చిల్లర దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడి జైలుకెళతాడు.,సత్పవర్తన కోసం పెరోల్ మీద బయటకు వస్తాడు. వాళ్ళ అమ్మ శీను వ్యవహారం నచ్చక ఇంటి నుంచి బయటకు పంపిస్తుంది .
బతకటానికి ఎన్నో ఉద్యాగాల గురుంచి ప్రయత్నించిన శీను , చివరకు వికలాంగుడైన మల్టీ మిలియనీర్ విక్రమాదిత్య (నాగార్జున)కు కేర్ టేకర్ గా ఉద్యోగం వస్తుంది. విక్రం పి. ఏ కీర్తి (తమన్నా) ని ప్రేమిస్తాడు. అన్ని ఉండి సంతోషం లేని విక్రం ,డబ్బుంటే చాలు అనుకునే శీను లకు మద్య జరిగిన సంగర్షణ ఏంటి?తను ప్రేమించిన కీర్తి(తమన్నా) ప్రేమను ఎలా గెలుచుకుంటాడు? అన్నదే మిగతా కథ.

నటినటులు

ఈ సినిమాలో ముఖ్యంగా నాగార్జున నటన సూపర్బ్, కేవలం మొహంలోని ద్వారా ఎక్స్ప్రెషన్స్ ద్వారా సినిమాను భుజాల పైన వేసుకోవటం అంటే అంట ఈజీ కాదు. ఒక రొమాంటిక్ మన్మదుడు గా ,వికలాంగుడు గా బాగా చేసాడు. మధ్యతరగతి అబ్బాయి గా ,కుటుంబం అంటే ఇష్టపడే అబ్బాయిగా , అల్లరి అబ్బాయి గా బాగా చేసాడు. తమన్న పరవాలేదు . ప్రకష్ రాజ్ కి మంచి పాత్ర దొరికింది. ముక్యంగా కార్తి వేసిన ఒక చిందరవందర పెయింటింగ్ కి 2 లక్షలు పెట్టి కొని ,దాని వెనుక ఉన్న లేని అర్థాన్ని సృష్టించి చెప్పే సీన్ లో కడుపుబ్బ నవ్విస్తాడు. జయసుద ,భరణి,అలీ వాళ్ళ పరిదిలో బాగా చేసారు. శ్రేయ ,అనుష్క ,అడవి శేషు లు తలుక్కున మెరిసి పోయారు.
సాంకేతిక విభాగం:

ఫ్రెంచ్ సినిమాను తెలుగు నెటివిటికి తగ్గట్టుగా మలచటంలో దర్శకుడు వంశీ పైడిపల్లి విజయం సాధించాడు. అది 50 ఏళ్ల వయసులో కూడా లవర్ బాయ్ ఇమేజ్ ఉన్నా నాగార్జున లాంటి స్టార్ హీరోను ఇలాంటి వైవిధ్యమున్న పాత్రకు ఒప్పించడంలో వంశీ పాత్ర అభినందనీయం. . తన మార్క్ తో అద్భుతమైన ఎమోషన్స్, సెంటిమెంట్‌, కామెడీతో అలరించాడు. కార్తిలోని కామెడీ ,ఎమోషన్స్ కోణాలను బాగా ఆవిష్కరించి ,మనసుకు హత్తుకొని పోయేవిధంగా క్లైమాక్స్‌ తో సినిమాను ముగించాడు వంశీ. గోపీసుందర్ నేపత్య సంగీతం బాగుంది .ఫోటోగ్రఫీ బాగుంది, క్షణం సినిమా తో మొదటి హిట్ కొట్టిన పివిపి సంస్థ, ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమా స్థాయిని మరింత పెంచాయి.
ప్లస్ పాయింట్స్

1) నాగార్జున ,కార్తి ల నటన
2) కథ ,కథనం
3) కార్తి ,ప్రకాష్ రాజ్ ల కామెడీ
4) మొదటి బాగం
5) పారిస్ అందాలు

మైనస్ పాయింట్స్

1) రెండో భాగం సాగదీసినట్లు ఉంది ,నాగార్జున లోని రొమాంటిక్ కోణాన్ని చూపించటం లో ముఖ్యంగా ఫారెన్ అమ్మాయి ని ఫ్లర్ట్ చేయటం ,శ్రియ తో ప్రేమాయణం ,అనుష్క తో సన్నివేశం బోర్ కొట్టిస్తాయి
2) పాటలు అంతగా ఆకట్టుకోవు.
3) తమన్నా పాత్ర పెద్దగ ఆకట్టుకోలేదు.

 

Rating: 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here