తెలంగాణ ఒగ్గు డోలుకి దద్దరిల్లిన నోవాటెల్

0
433

 

 

తెలంగాణ కళలు ప్రపంచంలో చాలా ప్రత్యేకమైనవి చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడి కళలు సంస్కృతులు ఎక్కడ కనిపించవు. విభిన్న రీతిలో ఉండే కళలు దాదాపు అన్ని కూడా తమ దైనందిన పనుల్లో భాగంగా అలసటను తీర్చేవిదంగా ఉంటాయి. వాటిలో ఒగ్గు డోలు ,పేరిణి నాట్యాలు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. చాలా క్లిష్టతరమైన ఈ నృత్యాలను ఎవరు కూడా నేర్చుకోవాలని ముందుకురారు ఎందుకంటే వీటి పైన పెట్టిన శ్రద్ద,కష్టం సగం వెస్ట్రన్ డాన్సుల పైన పెడితే నైపుణ్యులుగా కావొచ్చు దానికి తోడు సినిమాల్లో ,స్టేజి ప్రదర్శనలు ఇచ్చి వాణిజ్యపరంగా తమ పనిచేయించుకోవచ్చు. దాని వలన తెలంగాణ నృత్యాలకు ఆదరణతో పాటు నేర్చుకొనే వాళ్ళు తక్కువ అయ్యారు.

కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మాత్రం ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ వలన  ఒగ్గు డోలు ,పేరిణి లాంటి నృత్యాలకు ఆదరణ దొరుకుతుంది. ప్రధానంగా ఐటి ఉద్యోగులకు ఈ నృత్యాలు హాట్ ఫేవరేట్ అయి కూర్చున్నాయి. తెలంగాణ లోని ప్రముఖ ఐటీ అసోసియేషన్ టీటా (తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ) ఐతే ఒక అడుగు ముందుకు వేసి ఒగ్గు డోలు ,పేరిణి నాట్యాలను నిత్యం విదేశీయులు ,ప్రముఖ వ్యాపారవేత్తలకు కేంద్రం అయిన నోవాటెల్ లో ఒక కార్యక్రమంలో భాగంగా ప్రదర్షింపచేశారు. దీనితో ప్రముఖ టెక్నాలజీ మ్యాగజైన్ సంస్థ డేటా క్విస్ట్ సిబ్బంది ఐతే వీళ్ళ ప్రదర్శనలను చూసి ముగ్దులైపోయారు.భవిష్యత్తులో తెలంగాణ నృత్యాలకు ప్రపంచపరంగా ఆదరణ లభించాలని కోరుకుందాం.  ఈ కింది వీడియోలో చూస్తుంది వారు ఎంత బాగా చేశారో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here