నెంబర్1: అప్పట్లో చిరు ఇపుడు బాబు

0
421

అదేంటి చంద్ర బాబు నాయుడు రాజకీయాల్లోనెంబర్ 1 గా అయన ముఖ్య మంత్రి గా ఉన్నపుడు రూల్ చేశాడు కాని మెగా స్టార్ చిరంజీవి సినిమాల్లో నెంబర్ 1 గా 30 ఏండ్లు పాలించాడు కాని రాజకీయాల్లో ఫెయిల్ అయ్యాడు. మరి ఇద్దరికీ పోలిక ఏంటి అని అనుకుంటున్నారా? అవును ఉంది..
అసలు విషయానికొస్తే ఇటివల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో తెరాస పార్టీ ముందుగా ప్రచారం చేసుకున్నట్టు ,ఎవరు ఊహించని విదంగా 99 సీట్లు గెలిచారు . అదే విదంగా ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసి తెరాస కి గట్టి పోటి ఇస్తారనుకున్నా తెదేపా ఎవరు ఊహించని విదంగా ఒక్క స్థానానికి పరిమితం అయింది. ఈ పరిణామాన్ని తెదేపా నే కాదు ఇటు తెరాస అటు గ్రేటర్ ప్రజలు కూడా ఊహించలేదేమో .
ఐతే గత గ్రేటర్ ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీ కి కూడా ఒకటే సీట్ వచ్చింది .ఒల్ద్ బోయన్ పల్లి లో గెలిచింది. కాని అప్పటికే ప్రజారాజ్యం సాదారణ ఎన్నికల్లో ఓడిపోయి ,గెలిచినా వాళ్ళు వివిధ పార్టీ ల్లోకి కర్చిప్ లు వేయటం వాళ్ళ పూర్తిగా నిర్వీర్యం అయిపొయింది . కాని తెదేపా పరిస్తితి వేరు చేతిలో ఒక రాష్రాన్ని ఏలుతూ రేవంత్ రెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ ని చేతిలో పెట్టుకొని కూడా ఆ సీట్లు రావటం విశేషమే. ఏది ఏమైనా గ్రేటర్ ఎన్నికల్లో ఈ విదంగా అప్పట్లో చిరు ఇప్పుడు చంద్ర బాబు నెంబర్ 1
అయ్యారన్న మాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here