ఫ్లెక్సీ రాజకీయాలపైన ఎన్నారై ఉద్యమం

0
4907

టెక్నాలజీ పెరిగితే దానితో మంచి చెడు రెండు ఉంటాయి. ఒకపుడు రాజకీయ నాయకులు తమ ప్రకటనలు ,శుభాకాంక్షలు గోడలపైనా పెయింట్ రూపములోనో లేక తెల్ల బట్టపైన వేసిన పెయింటింగ్ బ్యానర్ పైన ప్రదర్చించేవారు. అవి తయారు చేయటానికి చాల సమయం పట్టేది ఎందుకంటే అవన్నీ మాన్యువల్ వర్కులు కాబట్టి. ఖర్చు కూడా ఎక్కువే. కానీ ఎప్పుడైతే కంప్యూటర్జ్డ్ ఫ్లెక్సీ బ్యానర్ వచ్చిందో సమయం ,మాన్యువల్ వర్క్ రెండు తక్కువ కావటం వలన దానికి అనుగుణంగానే ఖర్చు తగ్గిపోయింది. ఈ ప్రభావం వలన ఊరుకి ఒకరు ఇద్దరు ఉన్న నాయకుల సంఖ్య ఇంటింటికి ఒక లీడర్ తయారయ్యాడు. దీని వలన ఎక్కడ చూసిన కూడా ఫ్లెక్సీలు ,ఒకరి ఫ్లెక్సీలు తీసి మరొకరివి వేయటం వలన గొడవలు పెరిగాయి. ఫ్లెక్సీలు రసాయనిక పదార్తాల వస్తువు కాబట్టి పర్యావరణాన్ని పాడు చేసే గుణం చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్క కోదాడ లాంటి ఒక పట్టణం లో లక్ష ఫ్లెక్సీలు ఉండటం చూస్తే మనకు అర్థం అవుతుంది ఫ్లెక్సీల వాడకం ఏంటో. ఈ పరిణామణాన్ని ఒక కోదాడ కి చెందిన ఒక ఎన్నారై తీవ్రంగా పరిణమిస్తూ దాన్ని ఒక ఉద్యమంగా మారుస్తున్నాడు. కోదాడ కి చెందిన జలగం సుదీర్ ఫ్లెక్సీ లకు వ్యతిరేకంగా తెలంగాణా మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ని కలిసి ఉత్తర రూపంలో సమర్పించాడు. అంతే కాకుండా కోదాడలోని పాత్రికేయులకు ప్రతి ఒక్కరిని కలిసి ఈ ఫ్లెక్సీల వలన వచ్చే చేదు ప్రభావాలను వివరించి వారిని కూడా ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని కోరారు. మీడియా మిత్రులు ఈ ఉద్యమంలో పాల్గొంటే ఉద్యమ స్వరూపం మారిపోతుందని,క్షేత్ర స్థాయిలోకి సులువుగా వెళ్లి ప్రజల్లో అవగాహనా వస్తుందని సుదీర్ కుమార్ చెప్పాడు. అయన చేస్తున్న కృషి ఫలితాన్ని ఇచ్చి ఫ్లెక్సీలు లేని కోదాడ ని తద్వారా ఫ్లెక్సీ రహిత తెలంగాణ ని మనం చూడాలని కోరుకుందాం.
ఆయన రాసిన లేఖని ఒకసారి చూద్దాం .

————————————————————————————————–

Date: 23/08/2016

శ్రీ కే.టి.రామారావు గారు

   ఐ.టి మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి

విషయం: క్లీన్ కోదాడ కు మీ  సహయం, లక్షకు పైగా ఉన్న అనదికార ఫ్లెక్సిల తీసివేత  

నల్లగొండ జిల్లా కోదాడ ప్రాంతానికి చెందిన జలగం సుధీర్ కుమార్ అనే నేను 2001 నుండి టి.ఆర్.ఎస్ పార్టి లో పనిచేస్తు తెలంగాణ ఉద్యమం లో ప్రత్యక్షంగా, పరొక్షంగా  పాల్గొన్న అనుభవం తో,  ప్రత్యెకించి రాజాకీయాల్లో మీరు చేస్తున్న అనేక మంచి పనులను ఆదర్శంగా తీసుకోని అమెరికాలో ఉద్యొగానికి రాజినామా చేసి మాత్రుభూమి సేవ కోసం ఇక్కడకు వచ్చాను.

గత కొంతకాలంగా నల్లగొండ జిల్లా కోదాడ ప్రాంతానికి చెందిన పెద్ద చెరువు కబ్జా, రోడ్ల మరమత్తుల విషయాలు సంబందిత అధికారుల ద్రుష్టికి తీసుకురావటం వారు వెంటనే స్పందించి తగిన చర్యలు మొదలు పెట్టడం జరిగింది. మన ప్రభుత్వం పై కోదాడ ప్రాంత ప్రజల్లో ఇంకా విశ్వాసం పెరగటం గమనించదగ్గ విషయం.

ఫ్లెక్సి, హోర్డింగ్స్ ల విషయం లో మీరు ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు చేసిన సూచనలు, ఉత్తర్వులు  అభినందనీయం.

కోదాడ పట్టణం, పరిసర ప్రాంతాల్లో దాదాపుగా లక్ష కు పైగా చిన్న, పెద్ద ఫ్లెక్సి లు ఇంకా ఉండటం, దానివల్ల విద్యార్దులకు, ప్రయాణికులకు, వాహనాలు నడిపే వారికి  అసౌకర్యంగా ఉండటం తో పాటు యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఉండటం పరిశీలించవల్సిన అంశం.

ఈ విషయం లో దయచేసి మీరు కొదాడ మున్సిపల్ అధికారులకు తగిన ఉత్తర్వులు ఇచ్చి అన్ని ఫ్లెక్సిలు తీసివెయించి  స్వచ్చ కోదాడ విషయం లో సహకరించగలరని విజ్ఞప్తి.అదేవిదంగా  సుమారు 100 ప్రాంతాల్లో మాత్రమే ఫ్లెక్సి లు ఏర్పాటు చేసె విషయం పరిశీలిస్తే అది కోదాడ మున్సిపాలిటి కి అదికారిక ఆదాయ వనరుగా కూడ ఉపయొగపడుతుంది.

మీలాంటి యువ నాయకుల్ని ఆదర్శంగా తీసుకోని సమాజానికి నా వంతు సేవ చేయాటానికి వచ్చిన నన్ను ప్రొత్సహిస్తారని ఆశిస్తూ,

ధన్యవాదములతో,

జలగం సుధీర్ కుమార్

Email: sudheerjalagam@gmail.com

Phone: 95151 50570

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here