కరోనా కాలచక్రానికి తన సేవతో బ్రేకులు వేస్తున్న డాక్టర్ అప్పాల చక్రాదారి

32 0

డాక్టర్ అప్పాల చక్రదారి పేరు ఉత్తర తెలంగాణ లో అపుడే పుట్టిన చిన్నపిల్లల తల్లితండ్రులను ఎవ్వరిని అడిగినా చెబుతారు.నిర్మల్ పట్టణంలో చక్రాదరి డాక్టర్ దగ్గరికి తన పిల్లల్ని ఒక్కసారైనా తీసుకెళ్లితే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని వేలాది తల్లిదండ్రుల నమ్మకం.గత 30 ఏళ్లుగా  తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు,వ్యక్తి గత జీవితంలో మరెన్నో అడ్డంకులు వచ్చినా కూడా తాను నమ్ముకున్న వైద్య రంగాన్ని వదలకుండా చిన్న పిల్లలకు దేవుడిగా మారాడు. స్వతహాగా కవి,రచయిత,సామాజికవేత్త అయిన డాక్టర్ సాబ్ రాసిన నేను ఆడిలాబాదోడినే కవితా సంకలనం అప్పట్లో సంచలనం సృష్టించింది.వీలు చిక్కినపుడల్లా సమాజ సేవలో ముందుండే డాక్టర్ గారు కరోనా సంక్షోభంలో ఆయన చేస్తున్న వైద్య సేవలు,సామాజిక సేవలు అందరికి స్పూర్తినిస్తున్నాయి.

వివరాల్లోకి వెలితే నిర్మల్ మీదుగా వెళ్తున్న NH 44 పైనుండి ఉత్తర్ ప్రదేశ్ మరియు మధ్య ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పేద వలస కూలీలు స్త్రీలు, పురుషులు తమ పిల్లా పాపలతో, ఇందులో 5 మరియు 6 సంవత్సరాల పిల్లలతో పాటు 6 మాసాలు, ఏడాది పిల్లలు కూడా ఉన్నారు. పడరాని పాట్లు పడుతూ కాలినడకన మరియు కొంతమంది సైకిల్స్ పై తమ స్వంత గ్రామాలకు పోతున్నారు.
ఈ రోజు,26/04/2020,ఆదివారం, ఉదయం 6.30 గంటలకు నీలాయిపేట, ఆనంతపేట,బూర్గుపల్లి మరియు తాండ్ర గ్రామ సమీపంలోని జాతీయ రహదారి నెంబర్ 44 పై డాక్టర్ చక్రదరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్స్ డా.అప్పాల కావేరి ఫౌండేషన్ సుమారు రూపాయలు యాభైవేల(50000) విలువ గల వివిధ రకాల బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం మొదలుపెట్టారు.
మొదటి దఫాగా దాదాపు 200 మందికి పంపిణీ చేయడం జరిగింది.అందులో కొంత మంది నీళ్లు కూడా అడిగారు, రేపు నీళ్లు కూడా ఇవ్వాలని ఫౌండేషన్ నిర్ణయించింది.
చక్ర దారి మాట్లాడుతూ “వారిని మేమువివరాలు అడిగితే,హైదరాబాద్ నుండి తప్పని పరిస్థితుల్లో ఇలా రిస్కు తీసుకొని స్వంత గ్రామాలకు(UP & MP) వెళ్తున్నామని, పరిస్థితులు చక్కబడితే మళ్లీ తెలంగాణ వస్తామని చెప్పారు.
ఎవరు ఎన్ని చెప్పినా స్వంత ఊరుపై మమకారం ఒకవైపు ఉపాధి అవకాశాల పట్ల అభద్రతా భావం ఇంకొక వైపు వాళ్ళను ఈ తెగింపుకు లేదా సాహసానికి ఉరికొల్పాయి.అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ వలసలపై అందరికీ ఆమోదయోగ్యమైన ఒక ఖచ్చితమైన విధానాన్ని ప్రకటిస్తే బాగుంటుంది.
ఈ కార్యక్రమం దాదాపు ఐదు రోజులవరకు కొనసాగవచ్చు.” అని అన్నారు.

 

 

 

Related Post

300 మంది వలస కూలీలకు ఆహారాన్ని అందించిన నిజాంపేట్ 18 వార్డ్ కార్పొరేటర్

Posted by - April 16, 2020 0
ఈ రోజు 10 వ రోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని రేణుక ఎల్లమ్మ కాలనీ లో రేణుక ఎల్లమ్మ హోటల్ సహకారంతో శ్రీ కొలను వీరేందర్…

నిత్యవసర వస్తువులను పంపిణీ చేసిన డాక్టర్ జేఎన్ వెంకట్

Posted by - May 3, 2020 0
మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో నిరుపేదలకు నిత్యవసర సరుకుల పంపిణీ .కొంతమంది వృద్ధులు ఇంటి నుంచి రాలేక నడవలేక ఇంట్లోనే ఉండిపోయారు వారి ఇంటికి వెళ్లి వారికి…

పేదలను ఆదుకుంటున్న కార్పొరేటర్ జానకి రామ రాజు

Posted by - April 16, 2020 0
రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి నివారణకు లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయిన వలస కూలీలకు, కార్మికులకు, పేదలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ కేటీఆర్…

కోతులకు ఆహారం అందజేసిన వాయిస్ టుడే ఛానల్ MD కొత్త లక్ష్మణ్

Posted by - April 15, 2020 0
కరోనా వ్యాధి ప్రబలడంతో దేశవ్యాప్తంగా లార్డ్ టౌన్ లో భాగంగా అన్ని దేవాలయాల్లో భక్తులు దర్శనాలను నిలి పి వేయడం జరిగింది దీనిలో భాగంగా జగిత్యాల జిల్లా…

వరంగల్ లో పోలీస్ సిబ్బందికి శానిటైజర్లు పంచిన సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ జిల్లా కన్వీనర్ రామన్

Posted by - April 13, 2020 0
కరోన వైరస్ తో ప్రపంచం మొత్తం స్తంభించిన కారణంగా ప్రజలు వైరస్ బారిన పడకుండా సేవలు చేస్తున్న వారికి కృతజ్ఞతలు చెబుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా Save…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *