విడుదల అయిన నోకియా స్మార్ట్ ఫోన్…

0
422
Nokia has launched its new range of Android smartphones in India.
Nokia has launched its new range of Android smartphones in India.
  హెచ్‌ఎండీ గ్లోబల్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌తో నోకియా స్మార్ట్‌ఫోన్లను ఇండియాలో విడుదల చేసింది. ఈ ఫోన్లకు నోకియా 6, నోకియా 5, నోకియా 3 అనే పేరుతో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇక వాటి ధర విషయానికి వస్తే నోకియా 6 రూ. 14,999. నోకియా 5 రూ. 12,899 కాగా నోకియా 3 స్మార్ట్‌ఫోన్ రూ. 9,499గా ఉంది. నోకియా 3 స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు జూన్ 16 నుంచి ప్రారంభం కానుండగా నోకియా 5 అమ్మకాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇక నోకియా 6ను జులై 14 నుంచి అమెజాన్‌లో ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. దేశంలోని అన్ని రిటైల్ స్టోర్లలో నోకియా 5, 3 స్మార్ట్‌ఫోన్లు దొరుకుతాయి. నోకియా 6 మాత్రం కేవలం అమెజాన్ వెబ్‌సైట్‌లో మాత్రమే లభిస్తుంది. ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ మూడు ఫోన్లు పనిచేస్తాయి. బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ ఈ ఫోన్ల స్పెషల్.
  నోకియా 6
   .. 5.5 అంగుళా ఫుల్ HD డిస్ప్లే
   .. ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్
   .. 4GB ఎల్పీడీడీఆర్3 ర్యామ్
   .. 64GB ఇంటర్నల్ స్టోరేజ్ (మైక్రోఎస్డీతో 128GB వరకు పెంచుకోవచ్చు)
   .. డ్యుయల్ టోన్ LED ఫ్లాష్‌తో కూడిన 16 MP వెనుక కెమెరా
   .. 84 డిగ్రీల వైడ్ యాంగిల్‌ లెన్స్‌తో 8 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
   .. 4G LTE, బ్లూటూత్ 4.1, USB ఓటీజీ, WIFI, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ
  నోకియా 5
  .. 5.2 అంగుళాల HD ఐపీఎస్ LCD డిస్ప్లే
  .. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
  .. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్
  .. 2GB ర్యామ్, 16 GB ఇంటర్నల్ మెమొరీ (మైక్రోఎస్డీతో 128జీబీ వరకు పెంచుకోవచ్చు)
  .. డ్యుయల్ LED ఫ్లాష్‌తో 13 MP వెనుక కెమెరా
  .. 84 డిగ్రీల వైడ్ యాంగిల్ 8 MP సెల్ఫీ కెమెరా
  .. ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టమ్
  .. 4G LTE, 3000 MAH బ్యాటరీ
  నోకియా 3
  .. 5 అంగుళాల HD ఐపీఎస్ LCD డిస్ప్లే
  .. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
  .. క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6737 ప్రాసెసర్
  .. ముందు, వెనుక 8 MP ఆటోఫోకస్ కెమెరా. ముందు 84 డిగ్రీల వైడ్ యాంగిల్.
  .. 2GB ర్యామ్, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ (మైక్రోఎస్డీతో 128GB వరకు పెంచుకోవచ్చు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here