ఆ గట్టున ఉంటావా సింగర్ కి అన్యాయం జరిగిందా ?

0
435

 రంగస్థలం సినిమాలో ఉన్న ఆ గట్టున ఉంటావా పాట పాడిన శివ నాగులు కి అన్యాయం జరిగిందా అంటే అవునని అంటున్నారు రంగస్థలం చూసిన ప్రేక్షకులు . రంగస్థలం సినిమా ఒక వైపు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది . సినిమాలో అన్ని సాంగ్స్ మంచి ఆదరణ లభిస్తే ఎన్నికల ప్రచారంలో వచ్చే ఆ గట్టున ఉంటావా సాంగ్ కి కొన్ని ఓట్లు ఎక్కువే పడుతున్నాయి .అయితే ఒరిజినల్ ఆడియో ట్రాక్ లో పాట పాడిన ప్రముఖ జానపద గాయకుడు శివ నాగులు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా లైవ్ గా పాడాడు. దీంతో దేవి కొత్త వాళ్లకు మంచి అవకాశాలు ఇస్తున్నాడని మంచి పేరొచ్చింది. కాని సినిమా విడుదల అయ్యాక మాత్రం సినిమాలో సాంగ్ ని దేవి పాడటంతో అందరు అవాక్కయారు. అయితే దీనిపై సుకుమార్ స్పందిస్తూ షూటింగ్ కన్నా ముందు ఈ సాంగ్ దేవితో ట్రయిల్ గా పాడించామని ఆ వెర్షన్ తో షూట్ చేశామని తరువాత శివనాగులు తో పాడించిన మెయిన్ వెర్షన్ తో లిప్ సింక్ కాకపోవడంతో దేవి వెర్షన్ నే సినిమాలో పెట్టామని చెప్పాడు.కానీ ఈ విషయం శివనాగులు కి కమ్యూనికేట్ చేయటంలో సినిమా యూనిట్ ఫెయిల్ అయినట్లు తెలుస్తుంది. కారణాలు ఏమైనా శివనాగులు కి నోటి కాడి కొచ్చిన ముద్ద వెనకకు వెళ్ళింది అని అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here