టోల్ ప్లాజాల వద్ద వీవీఐపీల లేన్లు రద్దు…

0
251
no vip lane at toll plaza
no vip lane at toll plaza

వీవీఐపీలు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ప్రత్యేకంగా వారికోసం టోల్ ప్లాజాల వద్ద లేన్లను ఏర్పాటు చేసిన సంగతి అందరికి తెలిసిందే…అయితే ప్రజలందరికీ అన్ని సౌకర్యాల్లో సమాన భాగం ఇస్తూ సమానంగా చూడాలని వీవీఐపీ సంస్కృతిని పక్కనబెట్టాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం యోచిస్తోంది. టోల్ ప్లాజాల వద్ద వీవీపీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే లేన్లను రద్దు చేయాలని ఉత్తరప్రదేవ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై జిల్లా మేజిస్ట్రేట్లకు యూపీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సదాకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. వీవీఐపీ లేన్ల వల్ల అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయనీ, ప్రస్తుతమున్న అన్ని సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here