భారత ఐటి ఉద్యోగి : పైన పటారం …లోన లొటారం (కార్మిక దినోత్సవ ప్రత్యేక వ్యాసం)

2
13793

ఈ రోజు కార్మిక దినోత్సవం కాబట్టి ఒక ఐటి ఉద్యోగిగా ఐటి ఉద్యోగుల కష్టాల గురుంచి ప్రస్తావించాలని నిర్ణహించుకున్నాను. ఐటి ఉద్యోగులు అంటే 5 రోజుల పని ,work from home , i20 కార్లూ ,అవుట్ స్కర్ట్ లో విల్లాలు ,ఎపుడు కావాలంటే అపుడు బ్యాంకు లోన్లు ,క్రెడిట్ కార్డులు ,multiplex సినిమాలు ,ఏడాదికి రెండు లాంగ్ టూర్లు ,బ్రాండెడ్ దుస్తులు …. ఇది బయట ప్రపంచానికి కనపడే ఒక సాఫ్ట్ వెర్ ఉద్యోగి విలాసాలు …. కాని వాళ్లలో మెజారిటీ ప్రజలు పరాయి దేశ కంపనీలో బానిస జీవితాలు బతుకుతున్నారని ఎంత మందికి తెలుసు… 5 రోజుల పని అని చెప్పి వారానికి మించి పని చేయిస్తున్నారని ,8 గంటల పనిని 14 గంటలు పని చేస్తున్నారని ,work from home పేరు చెప్పి ఇంట్లో వాళ్లతో సరిగా గడపనీయకుండా వారాంతాల్లో పని చేస్తున్నారని ,ఒక క్రెడిట్ కార్డు బిల్ కట్టడానికి ఇంకో క్రెడిట్ కార్డుతో దగ్గరి పెట్రోల్ బంక్ లో కార్డు స్వైప్ చేస్తున్నార ని ఎంత మందికి తెలుసు,వేలల్లో జీతం అని చెప్పి టాక్సులు కట్ అయ్యాక కంపెనీ బయట చాయ్ దుకాణపు అయన కన్న తక్కువ డబ్బులు వస్తున్నాయని ఎంత మందికి తెలుసు,i20 కార్లల్లో తిరుగుతూ పెట్రోల్ కి డబ్బులు లేకుండా క్రెడిట్ కార్డులు use చేస్తున్నారని ఎంత మందికి తెలుసు,బ్రాండెడ్ దుస్తుల వెనుక బోరున విలపించే మనసుల గురుంచి ఎంత మందికి తెలుసు … అవుట్ స్కర్ట్ లో విల్లాల వెనుక ఇజ్జత్ కి ఇల్లు తీసుకొని 70% బ్యాంకు లోన్ ,20% వడ్డీ డబ్బులు ,10% డబ్బులు దోస్త్ గాడి దగ్గర వడ్డీ లేని ఋణం తీసుకుంటున్నారని ఎంత మందికి తెలుసు…. అనుకోకుండా మేనేజర్ వచ్చి నీ జాబ్ పోయింది రేపటి నుంచి ఆఫీస్ కు రావాల్సిన అవసరం లేదు,నీకు 3 నెలల జీతం ముందుగానే ఇస్తున్నాం పండగ చేసుకో అని అన్నపుడు అపుడే తోటి పని వాళ్ళతో ఆవాస హోటల్ లంచ్ చేసి వచ్చి ఒక్కసారిగా స్వర్గంలో నుంచి నరకంలోకి దిగజారడం ఎంత మందికి తెలుసు….

ఇలా చెప్పుకుంటూ పొతే ఐటి ఉద్యోగుల కష్టాలు కోకొల్లలు… కార్మిక దినోత్సవం రోజు కూడా పైన ఐటి ఉద్యోగులు అనటం ఏంటి ఐటి కార్మికులు అనొచ్చు కదా వీళ్లకు పొగరు అనుకుంటున్నారేమో ,కాదు ఐటి ఉద్యోగులు ఐటి కార్మికులు అనే విదంగా మాకు ప్రభుత్వం అర్హత ఇవ్వలేదు ఎందుకంటే మన దేశంలో అందరికి కార్మిక చట్టాలు వర్తిస్తాయి కాని 21 శతాబ్దంలో ఏడాదికి లక్షల కోట్లు ఐటి ఎగుమతులు చేయటానికి దోహద పడ్తున్న ఐటి ఉద్యోగులకు మాత్రం కార్మిక చట్టాలు వర్తించవని ఐటి యూనియన్ లకు అనుమతులు లేవని ప్రభుత్వాలు తేల్చి చెప్పాయి. నిజానికి మెట్రో సిటీల్లో 5 వేలకు కూడా కిరాయి నోచుకోని ఇంటి యజమానులు 20 వేల కిరాయి ఐటి ఉద్యోగుల వల్ల సంపాదిస్తున్నారు ,ఐటి ఉద్యోగుల వాళ్ళ రియల్ ఎస్టేట్ ,ఫుడ్ బిజినెస్ ,సినిమా హాళ్లు ,పర్యాటకం రంగం ,హాస్పిటళ్లు ఇలా చెప్పుకుంటే ప్రతి రంగం కూడా ఐటి రంగం చుట్టూనే తిరుగుతుంది. కాబట్టి లోన లొటారం పైన పటారం లాగా ఉన్న ఐటి ఉద్యోగులను వచ్చే మే డే లోగా ఐటి కార్మికులు అనేవిదంగా కేంద్ర ప్రభుత్వాలు ,రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరుతూ … మీ అందరికి కోసం నేను గతంలో రాసిన కవిత…

తిండిని పెట్టేవాళ్లకు.. కట్టే కొట్టేలు వాళ్ళకి..
చేపలు పట్టే వాళ్ళకి ..కోడిని కొట్టి చికెన్ అమ్మే వాళ్ళకి..
కంప్యూటర్ CODE కనిపెట్టే వాళ్ళకి కనిపెట్టిన CODE ని కాపీకొట్టివాళ్ళకి
స్టేడియమ్లో బంతిని పట్టేవాళ్ళకి,అదే బంతిని కొట్టే వాళ్ళకి
బిల్డింగులు కట్టే వాళ్లకు .. టాక్సులు కట్టే వాళ్లకు ,అపుడపుడు టాక్సులు ఎగ్గొట్టేవాళ్లకు
steering పట్టేవాళ్ళకి
అందరికి #MayDay శుభాకాంక్షలు

Ravinder Ryada
సామాన్య సాఫ్ట్ వెర్ ఇంజనీర్

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here