మళ్లీ తప్పని నోట్ల క‌ష్టాలు….

0
335
no cash boards in atms
no cash boards in atms
    పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత కొన్ని రోజుల‌పాటు న‌గ‌దు క‌ష్టాలు ఉన్నా కూడా ఆ త‌ర్వాత ప‌రిస్థితి కాస్త కుదుటపడింది. కానీ RBI బ్యాంకుల‌కు స‌రిప‌డా న‌గ‌దును స‌ర‌ఫ‌రా చేయ‌క‌పోవ‌డంతో ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. నోట్ల కొర‌త స‌మ‌స్యను త్వర‌గా ప‌రిష్కరించాల‌ని తెలంగాణ ప్రభుత్వం RBIకు మ‌రో సారి లేఖ రాసింది. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత మార్చి నెలలో పరిస్థితి కుదుటపడిందని, ఏటీఎంలు సైతం వినియోగంలోకి వచ్చాయని అందులో పేర్కొంది. అయితే ఏప్రిల్‌ నుంచి మళ్లీ నోట్ల క‌ష్టాలు మొదలైందని తెలిపిన ప్రభుత్వం మే నెల‌లో ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యారైంద‌ని వెల్లడించింది. డిజిట‌ల్ లావాదేవీలు పెరిగిన‌ప్పటికీ చేతిలో న‌గ‌దులేక రాష్ట్ర ప్రజ‌లు చాలా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని RBI కు తెలిపింది రాష్ట్ర స‌ర్కార్.

    మ‌రో వైపు అద‌న‌పు ఛార్జీలు ప‌డుతుండ‌టంతో డ‌బ్బు డిపాజిట్ చేసే వారి సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయింద‌ని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఒక్కసారి జీతాలు ప‌డితే అద‌న‌పు ఛార్జీల నుంచి త‌ప్పించుకునేందుకు మొత్తం డ‌బ్బును ఒకే సారి డ్రా చేయటంతో బ్యాంకుల్లో క్యాష్ ఖాళీ అవుతోంద‌ని వివ‌రించారు. త‌ము ఎదుర్కొంటున్న ఇబ్బందిని RBI దృష్టికి తీసుకొచ్చిన‌ట్లు బ్యాంకులు చెబుతున్నాయి. RBI తగినంత నగదు ఇవ్వకపోవటంతో బ్యాంక‌ర్లు ఖాతాదారుల‌కు తాము అడిగినంత డ‌బ్బును ఇవ్వలేక‌పోతున్నట్లు తెలిపారు. డబ్బు ఏటీఎంలో పెట్టిన గంట‌కే ఖాళీ అయిపోతోంద‌ని బ్యాంక‌ర్లు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here