నిజామాబాద్ లో ఎవరు గెలిచినా కేంద్ర మంత్రి అవుతారట?

0
183

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా జరుగనున్నాయి.దీనికి కారణం ఒకప్పటి రాజకీయ మిత్రులు కేసీఆర్-డీఎస్ ల వారసులు కల్వకుంట్ల కవిత-ధర్మపురి అరవింద్ మధ్య పోటీయే.ఒకరేమో ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డ్ గ్రహీత,మరొకరు మోడియిజాన్ని నిజామాబాద్ జిల్లాలో చూపుతూ రాజకీయాన్ని పరిగెత్తిస్తున్న నేత.వాస్తవానికి మొన్నటి ఎన్నికల తర్వాత తెలంగాణ లో ఉన్న అన్ని ఎంపీ సీట్లు తెరాస కు వస్తాయని అంచనా వేస్తున్నా నిజామాబాద్,కరీంనగర్, సికింద్రాబాద్ సీట్ల విషయంలో మాత్రం అపుడే ఫలితాలను అంచనా వేయలేకపోతున్నారు.ప్రధానంగా నిజామాబాద్ లో రైతుల ఆందోళనలు,అరవింద్ దూకుడు,వీటితో పాటు ఈ స్థానంలో కవితకు వ్యతిరేకంగా 1000 మంది రైతులు ఎంపీ స్థానానికి నామినేషన్ వేయాలని కొన్ని గ్రామ కమిటీలు,రైతు సంఘాలు నిర్ణహించుకోవడం వంటి కారణాలు కవితకు వ్యతిరేక పవనాలు వీసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా నిజమాబాద్ లో అటు కవిత  ఇటు అర్వింద్ లలో ఎవరు గెలిచినా కేంద్ర మంత్రి అవుతారని ఒక చర్చ జరుగుతుంది.దానికి కారణం కేంద్రంలో మోడీకి అనుకూల పవనాలు వీస్తుండడంతో కవిత గెలిస్తే ఎటు తెరాస బీజేపీకి షరతులతో కూడిన పొత్తులో భాగంగా కవిత మంత్రి కావొచ్చు(తెరాస బీజేపీ వైపు ఎందుకు మొగ్గు చూపుతుందంటే రాష్ట్ర రాజకీయాల పరిస్థితి దృష్ట్యా తెరాస కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వదు మరియు థర్డ్ ఫ్రంట్ ఏర్పడే అవకాశం లేదు).ఒక వేళ అర్వింద్ కవిత మీద గెలిస్తే దేశంలో ఒక సంచలన నాయకుడు అవుతాడు ఎందుకంటే దేశంలో బలమైన సీఎం కూతురు,ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డ్ గ్రహీత కవిత ని ఓడిస్తే సంచలనమే.అపుడు అర్వింద్ కి మంత్రి పదవి ఇచ్చి రాష్టంలో బీజేపీ కి కొత్త ఊపు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని జిల్లాలో చర్చ జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here