కౌలు రైతు ఛాలెంజ్ లో భాగంగా కౌలు రైతుకు సహాయం చేసిన సర్పంచ్

0
147

శుభ కార్యాల సందర్బంగా పేద కౌలు రైతు లకు సహాయం చేయాలని ఆలోచనతో ఇప్పటి వరకు ఎంతో మంది రైతులకు సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సంస్థ అద్వర్యంలో సహాయం చేసింది. ఆ రోజు అనవసరపు ఖర్చులు పెట్టకుండా ప్రపంచానికి అన్నం పెట్టే రైతులకు ఈ కార్యక్రమంలో సంస్థలో ఉన్న సభ్యులు,సభ్యుల కుటుంభ సభ్యులు,సన్నిహితులు తమ పుట్టినరోజు సందర్బంగా రైతులకు సహాయం చేయటం జరుగుతుంది.

దీనిలో భాగంగా నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం హాసకొత్తూరు గ్రామ సర్పంచ్ ఏనుగు పద్మ రాజేశ్వర్ కొడుకు ఏనుగు కుశలవ్ పుట్టినరోజు సందర్బంగా గ్రామంలోని కౌలు రైతు నారాయణ కు యూరియా బస్తాలను అందచేయటం జరిగింది.

గత ఏడాది జిల్లాలోని కుకునూర్ గ్రామానికి చెందిన సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ గ్లోబల్ అధ్యక్షుడు,తెలంగాణ ఐటీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రవిందర్ ర్యాడ తన పుట్టినరోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి తన తోటి సభ్యులకు ఛాలెంజ్ గా విసరడం జరిగింది.ఈ ఛాలెంజ్ ద్వారా ఇప్పటి వరకు దాదాపు 50 మంది రైతులకు సహాయం చేయటం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here