నిజామాబాద్ లో డీఎస్ కి భారీ స్వాగతం

0
4529

రాజ్యసభ్య సభ్యుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా శుక్రవారం సొంత జిల్లా నిజామాబాద్ కి వచ్చిన ఆయనకు నగరంలోని లోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో అభినందన సభ ఏర్పాటు చేశారు.దీనిలో భాగంగా నిజామాబాద్ మొత్తం పండగ వాతావరణం ఏర్పడింది.
దానికి ముందు నిజామాబాద్ సరిహద్దు అయినా కామారెడ్డి దగ్గర బస్వాపూర్ లో ఆయనకు కామారెడ్డి ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ ఘన స్వగతం పలికారు. తర్వాత రాంచంద్రపల్లి , టోల్ గేట్ దగ్గర కార్యకర్తలు స్వగతం పలికారు. మాధవ నగర్ సాయి బాబా మందిరంలో పూజలు నిర్వహించిన డీఎస్ ,అక్కడి నుంచి దాదాపు 3 వేలకు మోటర్ బైకులతో కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తర్వాత అభినందన సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ లో సోనియా తప్ప ఎవరున్నా తెలంగాణ వచ్చేది కాదని ,తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ తప్ప ఎవరు కూడా సీఎం అయినా కూడా తెలంగాణ అభివృద్ధి అయి ఉండేది కాదని పెర్గోన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here