నేరం ఒకరిది, శిక్ష మాత్రం ఇందూర్ గల్ఫ్ వాసికి

0
618

 

70 వ దశకంలో కళా తపస్వి కె.విశ్వనాధ్ ,సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్ లో నేరం -శిక్ష అని సినిమా వచ్చింది. దానిలో కృష్ణ కారుని నడుపుతూ ఒక ఆక్సిడెంట్ చేస్తే దానికి ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి తమ్ముడి కంటి చూపు పోతుంది. ఇలా మన సమాజంలో నేరం ఒకరు చేస్తే శిక్ష మాత్రం వేరొకరికి భరించే సంఘటనలు కోకొల్లలు . నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తడపాకల్ గ్రామానికి చెందిన పూసల శ్రీనివాస్ పరిస్థితి చూస్తే కూడా మనకు నేరం శిక్ష సినిమా గుర్తొస్తుంది. సినిమాలో ఎం జరిగినా ఒకే కానీ నిజజీవితంలో ఇలాంటి సంఘటన జరిగితే మాత్రం ఒక నిండు జీవితం,అయన వెనుకున్న కుటుంబానికి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. అందులో ఒక మధ్య తరగతి వ్యక్తికి జరిగితే ఆ బాధ మాటల్లో చెప్పలేనిది.

 

అసలు విషయానికొస్తే పూసల శ్రీనివాస్ ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లాడు. 6 సంవత్సరాల తర్వాత శ్రీనివాస్ 2016లో తిరిగి స్వస్థలానికి వచ్చి పెళ్లి చేసుకున్నాడు. సెలవుల తర్వాత దుబాయ్ వెళ్లాడు. ఇపుడే ఆయన జీవితంలో అనుకోని సంఘటన జరిగింది.

శ్రీనివాస్ దుబాయ్ కు వెళ్లేప్పుడు ట్రావెల్ ఏజెంట్ మహష్ ఒక కవర్ ఇచ్చి,అందులో మందులు ఉన్నాయని వాటిని దుబాయ్ లోని తమ చుట్టాలకు ఇవ్వాలని చెప్పగా శ్రీనివాస్ ఆ మందుల ప్యాకెట్ ను తీసుకుని దుబాయ్ వెళ్లాడు. అవి దుబాయిలో నిషేదిత డ్రగ్స్ కావడంతో ఎయిర్ పోర్ట్ లో అరెస్టయ్యాడు . ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విషయాన్ని ఆందోళన చెందారు. ఈ విషయాన్నీ మంత్రి కేటీఆర్,ఇక్కడి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే విచారణ పేరుతో పోలీసులు రిపోర్ట్ జాప్యం చేయడంతో దుబాయ్ లో కోర్టు తుది తీర్పు ఇచ్చేసింది. శ్రీనివాస్ కు ఏడేళ్ల ఖైదు విధించింది.శ్రీనివాస్ దుబాయ్ కి వెళ్లేప్పుడు అతడికి మందుల బ్యాగ్ ఇచ్చిన ట్రావెల్ ఏజెంట్ మహేష్ ను విచారించగా మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు బయటపెట్టాడు. అయితే లోకల్ పోలీసులు మహేష్ పై మాత్రం కేసు నమోదు చేసి…మిగతా వారిని వదిలేశారని గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. గల్ఫ్ ఏజెంట్ల నుంచి డబ్బులు తీసుకుని…పోలీసులు కేసును పక్కదారి పట్టించారంటున్నారు.

 

ఏది ఏమైనా చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న శ్రీనివాస్ కి తొందరగా న్యాయం జరిపించాలని ఆయనకు యదాతతంగా పాత ఉద్యోగంలో చెరిపించాలని శ్రీనివాస్ బంధువులు చెపుతున్నారు.

 

Source:Gangadhar Babanagar(Gulf) and Dasari Ashok(Tadpakal)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here