దాతల కోసం ఎదురు చూస్తున్నఇందూర్ క్యాన్సర్ రోగి

0
280

క్యాన్సర్ లాంటి వ్యాధి సోకితే బాగా డబ్బున్న వాళ్ళు కూడా ఆస్తులు అమ్ముకున్న రోజులు చూశాం. అలాంటిది ఒక పేద కుటుంబంలో చేతికివచ్చిన కొడుకు అనుకుకోకుండా మంచం మీద పడితే ఆ తల్లితండ్రుల భాద చెప్పలేనిది.ఆ ఖర్చులను భరించలేక ఆ ఇల్లు మూలకు పడుతుంది.

నిజామాబాద్ నగరానికి చెందిన గాజులపేట ప్రాంతంలో బైరి సాయిలు ,శకుంతల కి శ్రీకాంత్ ఒక్కగానొక్క కొడుకు. 2 ఏళ్ల క్రీతం మలంలో రక్తం రావటం మొదలైంది. అందరూ అర్శమొలలు ఉన్నాయని అనుకొని డాక్టర్ ని సంప్రదించి లోపల పేగుకు బై యాప్సి పరీక్ష చేయగా రెక్టమ్ కార్సినోమా (పేగుకు సంబందించిన క్యాన్సర్ ) ఉందని డాక్టర్లు చెప్పటంతో హైదరాబాద్ లో ఉన్న బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఎన్నో కెమోథెరపి చేశారు. అయిన తగ్గకపోవడంతో వైద్యుల సలహాతో ఆరోగ్యశ్రీ సహాయంతో ఆపరేషన్ చేయటం జరిగింది. తర్వాత కూడా తగ్గకపోవడంతో 6 సార్లు కేమో చేశారు. అనుకకోకుండా 6 నెలల క్రీతం బైరి సాయిలు గుండెపోటు తో మరణించటంతో ఒక్కసారిగా ఇల్లు రోడ్డున పడింది. దానితో పాటు శ్రీకాంత్ కి నెల నెలకు దాదాపు 10 వేల మందులకు ఖర్చు అవుతున్నాయి. హైదరాబాద్ వెళ్లాలంటే తమ ఆర్థిక స్తొమత సరిపోవటంలేదని తల్లి విలపిస్తోంది. అర్వింద్ ధర్మపురి లాంటి వాళ్ళు కొందరు ముందుకొచ్చి సహాయం చేయటం జరిగింది. అయినా కూడా అద్దె ఇంట్లో ఉండటంతో నెల నెల ఖర్చులు పెరగటంతో ఎవరైనా దాతలు వచ్చి తన ఒక్కనొక్క కొడుకు ని ఆదుకోవాలని శకుంతల గారు అడుగుతున్నారు.

మీలో ఎవరైనా శ్రీకాంత్ కి సహాయం చేయాలంటే కింది నెంబర్ కి ఫోన్ చేయవచ్చు.

నెంబర్ :9505633073
9989627929

రిపోర్టింగ్ : ఆర్మూర్ శ్రవణ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here